
ఆరోగ్యాన్నిచ్చే అల్పాహారం!
అల్పాహారంగా తీసుకోదగినది స్ట్రాబెర్రీ జెల్లీ. ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని కూడా చూపుతుంది.
పుడ్ n బ్యూటీ
అల్పాహారంగా తీసుకోదగినది స్ట్రాబెర్రీ జెల్లీ. ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని కూడా చూపుతుంది. ప్రత్యేకించి కీళ్లనొప్పులతో ఇబ్బందిపడేవారికి ఇది మంచి ఆహారం. ఆ ఇబ్బందిలేని వారు కూడా దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు. ఈ వంటకం తయారీలో వాడే జెల్లీ క్రిస్టల్స్‌లో కొలాజెన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది. వెంట్రుకల పెరుగుదలకు కూడా ఉపకరిస్తుంది.
కావాల్సినవి:
జెల్లీ క్రిస్టల్స్ ఒక ప్యాక్. మార్కెట్‌లో విభిన్నమైన ఫ్లేవర్స్‌లో ఇవి లభ్యమవుతాయి. వీటిలో శాకాహార, మాంసాహార... చక్కెర సహిత, చక్కెర రహిత రకాలుంటాయి. వీటిలో దేన్నయినా ఎంచుకోవచ్చు. తగినన్ని స్ట్రాబెర్రీలు. జెల్లీ క్రిస్టల్స్ ప్యాక్‌పై సూచించిన పరిమాణంలో నీళ్లు.
తయారీ:
ముందుగా నీళ్లను వేడి చేసుకోవాలి. పొయ్యి మీద నుంచి నీటిని దించి వాటిలోకి జెల్లీ క్రిస్టల్స్‌ను కలిపి చల్లారనివ్వాలి. కట్ చేసిన స్ట్రాబెర్రీస్‌ను ఆ మిశ్రమంలో వేయాలి. దీన్నంతటినీ ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టి, గడ్డకట్టాక తీసి వడ్డించుకోవచ్చు. గార్నిష్‌గా పుదీనా ఆకులు పైన వేసుకోవచ్చు.
పోషక విలువల గణాంకాలు (100 గ్రాముల పరిమాణానికి)
ప్రోటీన్లు: 0.3 గ్రాములు
శక్తి: 334 కిలో క్యాలరీలు
కొవ్వు: ఉండదు
చక్కెర రహిత జెల్లీ క్రిస్టల్స్‌ను ఉపయోగిస్తే క్యాలరీల పరిమాణం ఇంకా తగ్గిపోతుంది.