పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘాట్ రోడ్డులాంటి రోడ్డు అది. కారు కింద ఎక్కడో పడిపోయి ఉంది. ఆ కారులో ఉన్న రాజేశ్వరి చనిపోయింది. ‘‘ఎలా జరిగింది?’’ రాజేశ్వరి భర్త రాంబాబును అడిగాడు ఇన్స్పెక్టర్.‘‘ఇక్కడికి దగ్గరలో ఉన్న గుడికి బయలుదేరాం. ఆమె డ్రైవింగ్ చేస్తూ ఉంది. చిన్న విషయంలో గొడవ వచ్చింది. సరిగ్గా ఈ ప్రదేశానికి వచ్చే సమయానికి గొడవ పెద్దదైంది. భరించడం ఇక నా వల్ల కాలేదు.
సారీ... నేను నీతో పాటు ప్రయాణించలేను. నువ్వు వెళ్లు... అంటూ కారు దిగిపోయాను. వచ్చి కూర్చుంటావా లేదా? అని కోపంగా అరిచింది. ప్లీజ్ నువ్వు వెళ్లు... అని నేను నడుస్తుండగానే కారును వేగంగా కొండ దిగువకు పోనిచ్చింది. పెద్ద శబ్దం! నేను ఊహించని పరిణామం ఇది. నేను కిందికి పరుగెత్తుకు వెళ్లాను. అప్పటికే ఆమె చనిపోయి ఉంది’’ బొంగురు గొంతుతో చెప్పాడు రాంబాబు.‘‘నిజంగా ఆమె డ్రైవింగ్ చేసిందంటావా?’’ అని ఇన్స్పెక్టర్ అన్నాడో లేదో కారు దగ్గరికి వెళ్లి నిశితంగా పరిశీలించారు సిబ్బంది.
గేర్ నాబ్, స్టీరింగ్ వీల్‌పై ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి.‘‘ఆమె ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి. సందేహం లేదు. ఆమె డ్రైవింగ్ చేసింది. ఇది ఆత్మహత్య’’ అన్నారు పోలీసు సిబ్బందిలో ఒకరు. ఫింగర్ ప్రింట్స్ గురించి రెండు మూడు సార్లు గుచ్చి గుచ్చి ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. ఒకటే సమాధానం వినిపించింది.‘‘ఇది ఆత్మహత్య కాదు హత్య’’ అన్నాడు ఇన్స్పెక్టర్.కొద్దిసేపట్లోనే ఇన్స్పెక్టర్ చెప్పింది నిజమని రుజువైంది.రాజేశ్వరిది ఆత్మహత్య కాదని ‘హత్య’ అని ఇన్స్పెక్టర్కు అనుమానం రావడానికి కారణం ఏమిటి?
జవాబు: కారు బయటే భార్యను హత్య చేసి శవాన్ని కారులో దాచాడు రాంబాబు. కొండ ప్రాంతంలో ఆమెను డ్రైవరు సీట్లో కూర్చోపెట్టి సీట్‌బెల్ట్ కట్టాడు. ఆ తరువాత... ఔట్ సైడ్ డోర్ హ్యాండిల్, సీట్‌బెల్ట్–బకెల్పై ఫింగర్ ప్రింట్స్ తుడిచేశాడు.ఔట్ సైడ్ డోర్ హ్యాండిల్, సీట్‌బెల్ట్–బకెల్లపై ‘ఫింగర్ ప్రింట్స్’ లేకపోవడం ఇన్స్పెక్టర్లో అనుమానాన్ని రేకెత్తించింది. ఈ అనుమానమే హంతకుడిని పట్టించింది.
నెత్తుటి ముద్ర
Published Sun, Jul 2 2017 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement