ఆనంది... భర్తకు దూరం కానుందా?! | Sakshi
Sakshi News home page

ఆనంది... భర్తకు దూరం కానుందా?!

Published Sun, Dec 13 2015 8:19 AM

ఆనంది... భర్తకు దూరం కానుందా?!

యేళ్ల తరబడి సా..గు..తూ.. ఉంటే ఏ సీరియల్ అయినా బోర్ కొట్టి తీరుతుంది. కానీ ‘చిన్నారి పెళ్లికూతురు’ మాత్రం అంతకంతకూ ఆకట్టుకుంటోంది. ఆనంది అనే చిన్న అమ్మాయి బాల్యవివాహంతో మొదలైన ఈ సీరియల్... ఉత్కంఠభరితమైన మలుపులతో నేటికీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అయితే ఇందులో అతి త్వరలో ఓ పెద్ద మలుపు రాబోతోంది. అది ఇప్పటివరకూ రానంత పెద్ద మలుపు. అందరి మనసులనూ కలచివేసే మలుపు. అదే... హీరో శివ్‌రాజ్ శేఖర్ మరణం!
 
అప్పటికే మొదటి పెళ్లితో ఘోర పరాభవానికి గురై, అష్టకష్టాలు అనుభవించి, గుండెను రాయి చేసుకుని బతుకుతోన్న ఆనంది జీవితంలోకి వస్తాడు శివ్. ఎలాగో ఆమె మనసును కరిగించి, అందులో స్థానం సంపాదిస్తాడు. ఆమెకు అన్ని విషయాల్లో తోడు నీడగా ఉంటూ ఆదర్శ భర్తగా మెలుగుతున్నాడు. అలాంటివాడికి మరణమా? అతను పోతే ఆనంది పరిస్థితి ఏమిటి? అతడే లోకమనుకునే ఆమె ఎలా బతుకుతుంది? తలచుకుంటేనే ప్రేక్షకుడికి, ముఖ్యంగా ఆ సీరియల్ అభిమానికి గుండె చెరువైపోతుంది. కానీ ఏం చేస్తాం... ఈ ట్విస్టుకు సిద్ధపడాల్సిందే!

Advertisement
Advertisement