సౌందర్యపు  మెరుపులు

Beauty tips - Sakshi

న్యూ ఫేస్‌

సహజసిద్ధమైన ఫేస్‌ ప్యాక్సే ముఖానికి సరికొత్త మెరుపునందిస్తుంది. మార్కెట్‌లో దొరికే రకరకాల బ్యూటీ కాస్మొటిక్స్‌ కంటే ఇంటిపట్టునే సిద్ధం చేసుకోగల చిన్న చిన్న చిట్కాలే అసలైన అందాన్ని సొంతం చేస్తాయి. అయితే కాస్త సమయం ముఖసౌందర్యానికి కేటాయించాల్సి ఉంటుంది. కేవలం ఫేస్‌ ప్యాక్సే కాకుండా క్లీనప్, ఆవిరి పట్టడం, స్క్రబ్‌ చేసుకోవడం మంచిది. ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలిగిపోయి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. జిడ్డు, నల్లటి మచ్చలు తగ్గి గ్లోయింగ్‌ వస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి : 
క్లీనప్‌ : ఆలీవ్‌ నూనె – టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్, రోజ్‌ వాటర్‌ – అర టీ స్పూన్‌కొబ్బరి పాలు – పావు టీ స్పూన్‌
స్క్రబ్‌ : దానిమ్మ గుజ్జు – 3 టీ స్పూన్, కొబ్బరి నూనె – అర టీ స్పూన్, తేనె – పావు టీ స్పూన్‌ చిక్కటి పచ్చిపాలు – 1 టీ స్పూన్‌
మాస్క్‌ : స్ట్రాబెరీ గుజ్జు – 2 టీ స్పూన్స్, ఖర్జూరం గుజ్జు – 2 టీ స్పూన్స్, టమాటా జ్యూస్‌ – 3 టీ స్పూన్స్, పెరుగు – పావు టీ స్పూన్‌

తయారీ :  ముందుగా ఒక బౌల్‌ తీసుకుని, అందులో ఆలీవ్‌ నూనె, నిమ్మరసం, రోజ్‌ వాటర్, కొబ్బరి పాలు వేసుకుని, బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గుజ్జు, పాలు, కొబ్బరి నూనె, తేనె ఒక బౌల్‌లోకి తీసుకుని, బాగా మిక్స్‌ చేసుకుని మూడు నుంచి ఐడు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత ముఖం చల్లని వాటర్‌తో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెరీ గుజ్జు, ఖర్జూరం గుజ్జు ఒక బౌల్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో టమాటా జ్యూస్, పెరుగు కూడా యాడ్‌ చేసుకుని, బాగా మిక్స్‌ చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని వాటర్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top