
కె–బ్యూటీ
నిన్న, మొన్నటి వరకు స్కిన్ గ్లో కోసం లోషన్లు, క్రీములు, ఫౌండేషన్లు ఉపయోగించేవారు. ఇప్పుడు ఇండియన్ జెన్ జెడ్, మిలీనియల్స్ తరం వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కె–బ్యూటీ ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ఈ కొరియన్ బేస్డ్ బ్యూటీ ఉత్పత్తుల మార్కెట్ పదకొండు లక్షల కోట్ల మార్క్‌ను తాకింది.
కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రజాదరణను కె–బ్యూటీ అని పిలుస్తున్నారు. చర్మ సంరక్షణ అంటే అందంగా కనిపించడానికి మాత్రమే కాదు. స్వీయ సంరక్షణ, దీర్ఘకాలిక పోషణ కూడా. నిజానికి భారత్ ఫ్రాన్స్ యుఎస్ ..వంటి సొంత ప్రాచీన సౌందర్య ఉత్పాదనల గల దేశాలు కూడా ఈ కె.బ్యూటీ అలల్లో మునిగిపోతున్నాయి. భారతీయ స్త్రీ, పురుషుల చర్మ తత్త్వం ప్రత్యేకమైనది. మన వాతావరణంలో ఎలాంటి సౌందర్య ఉత్పాదనలు పనిచేస్తాయో తెలిసినప్పటికీ కొరియన్ల చర్మం మరింత గ్లాసీ లుక్‌తో మెరవడమే దీనికి గల కారణంగా కనిపిస్తోంది. హైడ్రేషన్, ఎక్స్‌ఫోలియేషన్, ఉత్పత్తులను పొరలుగా వేయడం వంటి విధానాల ద్వారా ‘గ్లాస్ స్కిన్’ను సాధించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ పదం చాలా మంది భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారతీయ యువత కె–బ్యూటీ, గ్లో–అప్‌ను బాగా ఇష్టపడుతోంది. దీంతో ఆన్‌లైన్ వేదికగా ఈ ఉత్పత్తులు ఇంటి ముందుకే డెలివరీ అవుతున్నాయి.
ఇంట్లో స్పా అనుభూతి
భారతదేశంలో వేడి, తేమతో కూడిన వాతావరణం, విభిన్న చర్మ రకాలు, కాలుష్య స్థాయిలు మన చర్మ సంరక్షణను సవాల్ చేస్తుంటాయి. స్మైల్ మ్యూసిన్, జిన్సెంగ్, గ్రీన్ టీ.. వంటి పదార్థాలతో కూడిన కొరియర్ ఉత్పత్తులు చర్మానికి చికాకు కలిగించక పోవడం కూడా బహుళ ఆదరణ పొందుతున్నాయి. వివిధ దశలలో చర్మ సంరక్షణ విధానం, క్లెన్సింగ్, టోనింగ్, సీరమ్స్, ఎసెన్స్‌లు, మాయిశ్చరైజర్లు, ఎస్‌పీఎఫ్ లు అందానికి మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. కె–బ్యూటీ ఉత్పత్తులలో ఇంట్లో స్పా అనుభూతిని సొంతం చేసే విధంగా వివిధ దశల అప్లికేషన్స్ ఉంటున్నాయి. కె–బ్యూటీ దృష్టి కూడా భారతీయ యువతలో పెరుగుతున్న స్వీయ సౌందర్యానికి పూర్తి అనుగుణంగా ఉంటుంది.
చదవండి: Shoaib Malik సానియా మాజీ భర్త మూడో పెళ్లి పెటాకులే..?! వీడియో వైరల్
చర్మ సంరక్షణ తత్త్వాలకు అనుగుణంగా!
కె–బ్యూటీ కొరియన్ బ్రాండ్లకు మాత్రమే పరిమితం కావడం లేదు. జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్ కంపెనీలు కొరియన్ చర్మ సంరక్షణ తత్త్వాలను స్వీకరించి, దక్షిణ కొరియాలో కూడా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. భారతదేశంలో కె–బ్యూటీ భవిష్యత్తును గుర్తించి దక్షిణ కొరియాలోని అతిపెద్ద బ్యూటీ రిటైలర్ ఆలివ్ యంగ్ అమెరికాలో తన కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. దీంతో కె–బ్యూటీ గేమ్ మరింత పోటీతత్వాన్ని పొందబోతోందనేది అర్ధం అవుతోంది. దీని వల్ల భారతీయ యువతకు మరిన్ని ఎంపికలు, మెరుగైన ఉత్పత్తులు, సమీప భవిష్యత్తులో కొన్ని స్వదేశీ కె–బ్యూటీ ప్రేరేపిత బ్రాండ్‌లు కూడా లభించనున్నాయి. ఇదంతా చూస్తుంటే కె–బ్యూటీ ప్రపంచవ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తుందని అర్ధం అవుతోంది. కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రజాదరణను కె–బ్యూటీ అని పిలుస్తున్నారు.
చర్మ సంరక్షణ అంటే అందంగా కనిపించడానికి మాత్రమే కాదు. స్వీయ సంరక్షణ, దీర్ఘకాలిక పోషణ కూడా. నిజానికి భారత్ ఫ్రాన్స్ యుఎస్ .. వంటి సొంత ప్రాచీన సౌందర్య ఉత్పాదనల గల దేశాలు కూడా ఈ కె.బ్యూటీ అలల్లో మునిగిపోతున్నాయి. భారతీయ స్త్రీ, పురుషుల చర్మ తత్త్వం ప్రత్యేకమైనది. మన వాతావరణంలో ఎలాంటి సౌందర్య ఉత్పాదనలు పనిచేస్తాయో తెలిసినప్పటికీ కొరియన్ల చర్మం మరింత గ్లాసీ లుక్‌తో మెరవడమే దీనికి గల కారణంగా కనిపిస్తోంది. హైడ్రేషన్, ఎక్స్‌ఫోలియేషన్, ఉత్పత్తులను పొరలుగా వేయడం వంటి విధానాల ద్వారా ‘గ్లాస్ స్కిన్’ను సాధించడానికి ప్రాధాన్యత ఇస్తుంది.ఈ పదం చాలామంది భారతీయ వినియోగదారులను ఆకట్టు కుంటోంది. ముఖ్యంగా భారతీయ యువత కె–బ్యూటీ, గ్లో–అప్‌ను బాగా ఇష్టపడుతోంది. దీంతో ఆన్‌లైన్ వేదికగా ఈ ఉత్పత్తులు ఇంటి ముందుకే డెలివరీ అవుతున్నాయి. (ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే!)
ఇంట్లో స్పా అనుభూతి
భారతదేశంలో వేడి, తేమతో కూడిన వాతావరణం, విభిన్న చర్మ రకాలు, కాలుష్య స్థాయిలు మన చర్మ సంరక్షణను సవాల్ చేస్తుంటాయి. స్మైల్ మ్యూసిన్, జిన్సెంగ్, గ్రీన్ టీ.. వంటి పదార్థాలతో కూడిన కొరియర్ ఉత్పత్తులు చర్మానికి చికాకు కలిగించక పోవడం కూడా బహుళ ఆదరణ పొదదుతున్నాయి. వివిధ దశలలో చర్మ సంరక్షణ విధానం, క్లెన్సింగ్, టోనింగ్, సీరమ్స్, ఎసెన్స్‌లు, మాయిశ్చరైజర్లు, ఎస్‌పీఎఫ్ లు అందానికి మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. కె–బ్యూటీ ఉత్పత్తులలో ఇంట్లో స్పా అనుభూతిని సొంతం చేసే విధంగా వివిధ దశల అప్లికేషన్స్ ఉంటున్నాయి. కె–బ్యూటీ దృష్టి కూడా భారతీయ యువతలో పెరుగుతున్న స్వీయ సౌందర్యానికి పూర్తి అనుగుణంగా ఉంటుంది.
చర్మ సంరక్షణ తత్త్వాలకు అనుగుణంగా!
కె–బ్యూటీ కొరియన్ బ్రాండ్లకు మాత్రమే పరిమితం కావడం లేదు. జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్ కంపెనీలు కొరియన్ చర్మ సంరక్షణ తత్త్వాలను స్వీకరించి, దక్షిణ కొరియాలో కూడా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. భారతదేశంలో కె–బ్యూటీ భవిష్యత్తును గుర్తించి దక్షిణ కొరియాలోని అతిపెద్ద బ్యూటీ రిటైలర్ ఆలివ్ యంగ్ అమెరికాలో తన కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. దీంతో కె–బ్యూటీ గేమ్ మరింత పోటీతత్వాన్ని పొందబోతోందనేది అర్ధం అవుతోంది. దీని వల్ల భారతీయ యువతకు మరిన్ని ఎంపికలు, మెరుగైన ఉత్పత్తులు, సమీప భవిష్యత్తులో కొన్ని స్వదేశీ కె–బ్యూటీ ప్రేరేపిత బ్రాండ్‌లు కూడా లభించ నున్నాయి. ఇదంతా చూస్తుంటే కె–బ్యూటీ ప్రపంచవ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తుందని అర్ధం అవుతోంది.