ఒకేసారి పది ఆపరేషన్లు | The Beauty Cosmetics funday story | Sakshi
Sakshi News home page

ఒకేసారి పది ఆపరేషన్లు

Aug 31 2025 8:46 AM | Updated on Aug 31 2025 11:21 AM

The Beauty Cosmetics funday story

ఫోన్‌  స్క్రీన్‌ పై మెరిసే ముఖం మాయలో పడిపోతున్నారు. నిలువుటద్దం చూపే నిజాన్ని మరచిపోతున్నారు.యాప్‌లు గుప్పించే భ్రాంతిలో మునిగిపోతున్నారు.అందచందాల కోసం శస్త్రచికిత్సలకు సిద్ధపడుతున్నారు.అత్యాశతో సినీ తారలు కూడా ఈ గేమ్‌లో బలైపోతున్నారు.తమ సహజ అందాన్ని అన్‌ ఇన్‌ స్టాల్‌ చేసుకుంటున్నారు.ఒకవైపు ఇది ‘రిస్కీ రోడ్‌’ అని డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.అయినా, యువత ఆరాటం ఏమాత్రం ఆగడంలేదు.చివరికి చేతులు కాలాక అసలు సంగతి గ్రహిస్తున్నారు. మెరుపు కోసం వెళితే, మిగిలేది మాయని మచ్చలేనని!

యువతలో కొత్త ట్రెండ్‌ మొదలైంది. అదే డిజిటల్‌ ఫేస్‌ కావాలనే కోరిక! రీల్స్‌లో ఫిల్టర్స్‌తో అందంగా కనిపించే విధంగా నిజజీవితంలోనూ ఉండాలని కోరుకుంటున్నారు. ఇన్‌ స్టాగ్రామ్‌ రీల్స్, ఫొటో యాప్స్‌లో కనిపించే గ్లాస్‌ స్కిన్‌ , షార్ప్‌ జాలైన్‌ , పర్ఫెక్ట్‌ లిప్స్‌ చూసి ‘ఇదే నా ముఖం కావాలి!’అంటూ బ్యూటీ పార్లర్స్‌కు పరుగులు తీస్తున్నారు. అప్పటికీ సంతృప్తి చెందక కాస్మెటిక్‌ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. ఇరవై నుంచి ముపై ్ప ఏళ్ల వయసులో ఉన్న యువతే ఎక్కువగా రియల్‌ ఫేస్‌ ఫిల్టర్స్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

దీంతో లిప్‌ ఫిల్లర్స్, నోస్‌ రీషేపింగ్, లిపోసక్షన్‌ , బోటాక్స్‌ వంటి శస్త్రచికిత్సలు ఫ్యాషన్‌ గా మారిపోయాయి. అంతేకాదు, డిజిటల్‌ ఫిల్టర్స్‌ను నిజజీవితంలో దక్కించుకోవాలనే ఆశతో శరీర నిర్మాణం, చర్మంపై గరిష్ఠ హద్దులు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక యువతి లిపోసక్షన్‌  చేసినా ఇన్‌ స్టా వీడియోలో కనిపించిన ఫిల్టర్‌ లుక్‌ రాక నిరాశ చెందింది. మరో విద్యార్థిని పదికి పైగా లేజర్‌ సెషన్లు చేయించుకుని కూడా తాను నెట్‌లో చూసినట్టే ఫలితం రాలేదని స్కిన్‌  గ్రాఫ్ట్‌కే పట్టుబట్టింది. ఇవే ఉదాహరణలు ఈ ట్రెండ్‌ ఎంత దూరం వెళ్ళిందో చూపిస్తున్నాయి. ఇంతకుముందు అందం మెరుగుదల కోసం వచ్చేవారు, ఇప్పుడు పర్ఫెక్షన్‌  కోసం వస్తున్నారు. ఫిల్టర్‌ లుక్‌ అంటే ఎడిటింగ్, అది నిజజీవితంలో సాధ్యం కాదని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నప్పటికీ యువతలో మార్పు రాకపోగా, విపరీతంగా ఈ రియల్‌ ఫిల్టర్‌ ఫేస్‌ భ్రాంతి పెరుగుతోంది.

అతి అనర్థం!
అందంగా కనిపించాలనే ఆశతో బ్యూటీ పార్లర్‌ వెళ్లి తీసుకునే చికిత్సలు మొదట మెరిసే కాంతి ఇచ్చినా, తర్వాత సమస్యల వరదనూ సృష్టిస్తాయి. హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌తో జుట్టు మృదువుగా మారుతుంది. కాని, కొంతకాలానికి బలహీనమై రాలిపోతుంది. స్కిన్‌ పాలిష్, బ్లీచింగ్‌ వంటివి చర్మానికి తాత్కాలికంగా మెరుపునిస్తాయి. కాని తర్వాత మచ్చలు, ఎర్రదనమే మిగులుతాయి. ఇక తరచు మేకప్‌ వాడితే చర్మానికి ఊపిరాడక మొటిమలు, పొడిబారిన పెదవులు తప్పవు. ఐ లైనర్లు, మస్కారా ఎక్కువ వాడితే కళ్లకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. టాటూలు స్టయిల్‌గా అనిపించినా, జీవితాంతం అలానే ఉండిపోతాయి. తొలగించాలంటే నొప్పి, ఖర్చు, ప్రమాదం ఎక్కువ. ఇక ముక్కు, చెవులకు ఆభరణాలను పెట్టుకోవాలని అనవసరంగా అనేక రంధ్రాలు చేయించుకుంటే తరచుగా ఇన్ఫెక్షన్లు, గాయాలు రావడం సహజం. ఇలా తాత్కాలిక మెరుపు కోసం చేసే ఈ చర్యలు శాశ్వత నష్టాలను కలిగిస్తాయి.

అందంగా ఉండాలని మామూలు మనుషులూ కోరుకుంటారు. అయితే, సెలబ్రిటీలకు అది బతుకుబండిని లాగించే ఆక్సిజన్‌ లాంటిది. కెమెరా ముందు ప్రతి ఏజ్‌లైన్‌ , ప్రతి ముడత, ప్రతి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రోజూ మిలియన్ల కళ్లు, కెమెరా లెన్సులు, పాపరాజ్జీ ఫ్లాష్‌లు వారిని గమనిస్తూనే ఉంటాయి. అందుకే వారు ‘ఎప్పటికీ యవ్వనంగా, నాజుకుగా కనిపించాలి’ అనే ఒత్తిడిలో జీవిస్తారు. ఈ నిరంతర ఒత్తిడి వారిని సాధారణ మనుషుల కంటే ఎక్కువగా రిస్కీ ప్రయోగాల వైపు నెట్టేస్తోంది. అందుకే ఎంతోమంది నటీనటులు, మోడల్స్, గాయకులు అందం కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో భారీ మూల్యం చెల్లించుకున్నారు. సాధారణ మనిషి చేసిన తప్పులను సమాజం పెద్దగా పట్టించుకోదు గాని, సెలబ్రిటీలు చేసిన తప్పులు మాత్రం ప్రపంచం ముందు బహిర్గతమవుతాయి. అలాంటివారిలో తీవ్రంగా నష్టపోయిన సెలబ్రిటీలు వీరే:

లిన్‌  మే – చీప్‌ అందం ఖర్చు, మొత్తం జీవితం
మెక్సికో నటి లిన్‌  మే తక్కువ ఖర్చుతో త్వరగా బాగుపడతానని నమ్మి ఇరవై డాలర్లకు ఇంజెక్షన్‌  వేసుకుంది. కాని, అది నైపుణ్యం లేని వ్యక్తి చేసిన మోసం. బేబీ ఆయిల్, కుకింగ్‌ ఆయిల్, నీరు కలిపి ఆమె ముఖంలోకి పంపించడంతో, ముఖం వాచిపోయి శాశ్వతంగా దెబ్బతింది. అనేక సర్జరీలు చేసినా ఆమె అందం తిరిగి రాలేదు.

ప్రిసిల్లా ప్రెస్లీ – సిలికాన్‌  మోసం
హాలీవుడ్‌ ఐకాన్‌  ప్రిసిల్లా ప్రెస్లీ ఒక నకిలీ వైద్యుడి వలలో చిక్కుకుంది. పరిశ్రమల్లో వాడే నాసిరకం సిలికాన్‌ ని ముఖంలో ఇంజెక్ట్‌ చేయడంతో, ఆమె అందం శాశ్వతంగా దెబ్బతింది. ఒకప్పుడు వెండితెరపై మెరిసిన ముఖం, ఇప్పుడు పశ్చాత్తాపానికి గుర్తుగా మిగిలిపోయింది.

కోర్ట్నీ కాక్స్‌ – మితిమీరిన ఇంజెక్షన్ల తలనొప్పి
‘ఫ్రెండ్స్‌’ సీరియల్‌తో ప్రపంచాన్ని అలరించిన కోర్ట్నీ కాక్స్‌ యవ్వనం నిలబెట్టుకోవాలన్న ఒత్తిడితో వరుసగా ఇంజెక్షన్లు వేసుకుంది. ఫలితంగా ముఖం సహజత్వాన్ని కోల్పోయింది. చివరికి ఆమె స్వయంగా ‘ఇదంతా నా తప్పే’ అని ఒప్పుకొని సహజ వృద్ధాప్యాన్ని అంగీకరించింది.

డొనాటెల్లా వెర్సేస్‌ – శస్త్రచికిత్సల బలి
ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్‌  డిజైనర్‌ డొనాటెల్లా వెర్సేస్‌ పలు శస్త్రచికిత్సలు చేయించుకుంది. ఆ శస్త్రచికిత్సలు ఆమె రూపాన్ని సహజంగా మెరిపించకపోగా, విరూపం చేశాయి. ప్రజలు ఇప్పుడు ఆమె కొత్త ముఖాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు.

హైడి మాంటాగ్‌ – ఒకేసారి పది ఆపరేషన్లు
అమెరికా రియాలిటీ స్టార్‌ హైడీ మాంటాగ్‌ ఒకేసారి పది సర్జరీలు చేయించుకుంది. ముక్కు సవరణ నుంచి ఫేస్‌లిఫ్ట్‌ వరకు అన్నీ ఒకేసారి. కాని, ఆ నిర్ణయం తన జీవితంలోనే పెద్ద పొరపాటు అని తర్వాత తానే ‘అవసరం లేని సమయంలో నా సహజ అందాన్ని నాశనం చేసుకున్నాను.’ అని ఒప్పుకుంది. 

కోయనా మిత్రా – విఫలమైన ముక్కు సర్జరీ
ఒకప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌తో ఫేమస్‌ అయిన కోయనా ముక్కు సర్జరీ చేయించుకుంది. కాని, అది విఫలమై, మరో పెద్ద ఆపరేషన్‌  చేయించుకోవాల్సి వచ్చింది. ఈ పొరపాటు ఆమె కెరీర్‌కే అడ్డుగీత వేసింది.

అనుష్కా శర్మ – లిప్‌ ఇంజెక్షన్ల వివాదం
అనుష్కా శర్మ లిప్‌ ఇంజెక్షన్లు పెద్ద చర్చనీయాంశ మయ్యాయి. మొదట ఆరోగ్య సమస్య కోసం చేశానని చెప్పినా, తర్వాత అది అందం కోసం చేసుకున్నదేనని అంగీకరించింది.

రాఖీ సావంత్‌ – విఫలమైన ప్రయోగాలు
రాఖీ సావంత్‌ ఎన్నో సర్జరీలు చేయించుకుంది. వాటిల్లో కొన్ని విఫలమయ్యాయి. ముఖ్యంగా లిప్, నోస్‌ జాబ్స్‌ ఆమె సహజ అందాన్ని పూర్తిగా మార్చేశాయి.

శ్రుతి హాసన్‌  – ధైర్యంగా ముందుకు
శ్రుతి హాసన్‌  ముక్కు సర్జరీ చేయించుకుంది. ఫిల్లర్లు వాడింది. ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్న వెంటనే ‘ఇది ప్లాస్టిక్‌ సర్జరీ షాప్‌’ అంటూ కామెంట్లు చేశారు. కానీ, ‘నేను ఏమి చేశానో నాకు తెలుసు. ఇంకా ఎక్కువ చికిత్సలు చేసుకున్నవారూ ఉన్నారు. గ్లామర్‌ ప్రపంచంలో చాలామంది నిజాలను దాచిపెడతారు’ అంటూ అనేక విమర్శలు ఎదురైనా, తన నిర్ణయాన్ని ధైర్యంగా సమర్థించుకుంది.

అదితిరావు హైదరి – సహజ అందానికి దగ్గరగా
అదితిరావు హైదరి పలు ట్రీట్మెంట్లు చేయించు కున్నప్పటికీ, సహజమైన అందాన్ని కాపాడుకోవ డానికి ప్రయత్నించింది. అయినా రూపంలో వచ్చిన మార్పులను అభిమానులు గమనించి ట్రోల్‌ చేశారు. 

హీరోలు కూడా!
హీరోలు కూడా అందం కోసం వెనకడుగు వేయడంలేదు. షాహిద్‌ కపూర్‌ చేయించుకున్న ముక్కు సర్జరీని అభిమానులు ఎగతాళి చేశారు. సైఫ్‌ అలీ ఖాన్‌  బోటాక్స్‌ ట్రీట్మెంట్లు తీసుకున్నట్టు బహిరంగంగానే చెప్పడంతో సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ అతన్ని ఊపిరి తీసుకోనివ్వ లేదు. ఆమిర్‌ ఖాన్‌  వృద్ధాప్య రేఖలు తగ్గించుకోవడానికి చికిత్సలు తీసుకున్నాడని వార్తలు రావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోహార్‌ డెర్మల్‌ ఫిల్లర్లు చేయించుకున్నట్లు బయటపడగానే అతడూ ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. 

సినిమా ప్రపంచం యవ్వనాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. కాని, అందం కోసం చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం కాకపోవచ్చు. కొన్నిసార్లు అందం కోసం చేసిన రిస్క్‌ పశ్చాత్తాపంగా మిగిలిపోతుందని ఈ కథలే నిరూపిస్తున్నాయి.

అందమైన హాలీడే ప్యాకేజీ!
మెరుగైన అందంతో పాటు ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌ మొదలైంది. అదే అందమైన హాలిడే ప్యాకేజీలు. అంటే హాలిడే ట్రిప్‌తో పాటు కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకోవడం ఒకే ప్యాకేజీగా వస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ హాలీడే కమ్‌ కాస్మెటిక్‌ సర్జరీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో యువకులు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా టర్కీకి వెళ్లి సర్జరీ చేయించుకోవాలన్న ఆలోచన చాలామందికి బాగా నచ్చుతోంది, ఎందుకంటే అక్కడ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కాని, ఈ ప్యాకేజీల వెనుక నిజం మాత్రం వేరేలా ఉంటుంది. ఉదాహరణకు, హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఇస్తాంబుల్‌లో హెయిర్‌ ట్రాన్‌ ్సప్లాంట్‌ చేయించుకున్నాడు. 

సర్జరీ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ తో బాధపడ్డాడు. ఆ శస్త్రచికిత్స పూర్తిగా విఫలమైంది. టర్కీని ఆకర్షణీయంగా చూపించే సోషల్‌ మీడియా పోస్టులు ఎంత మెరిసిపోతున్నాయో, వాస్తవంలో అనుభవాలు అంత దారుణంగా ఉంటున్నాయి. ఇలాంటి సమస్యలు చాలా దేశాల్లో తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో పోస్ట్‌ సర్జికల్‌ కేర్‌ లోపించడం వలన సమస్యలు మరింత పెరుగుతున్నాయి. పైగా అక్కడ చాలా సర్జరీలు అర్హతలేని టెక్నీషియన్ల చేతిలో జరుగుతున్నాయి. మొదట ఆకర్షణీయమైన ఫోటోలు చూపిస్తారు కాని, తర్వాత వచ్చే సమస్యల గురించి ఎవరూ చెప్పరు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి, ఎందుకంటే ఎక్కువమంది చికిత్స వివరాల కోసం కేవలం సోషల్‌ మీడియాపైనే ఆధారపడుతున్నారు.

ప్రయోజనాలు నష్టాలు!
జీవితంలో ప్రతి నిర్ణయంలాగే, కాస్మెటిక్‌ సర్జరీ విషయంలో కూడా ప్లస్‌ పాయింట్స్, మైనస్‌ పాయింట్స్‌ ఉంటాయి. వాస్తవాన్ని గుర్తించి, నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే చికిత్స తీసుకుంటే ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి. కాని అత్యాశతో, విపరీతమైన చికిత్సలు తీసుకుంటే మాత్రం ప్రమాదాలు తప్పవు. 
ప్రయోజనాలు!

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది: మనసులో చాలాకాలం నుంచి ఉన్న చిన్న లోపం (ఉదాహరణకు చదునుగా కనిపించే ముక్కు లేదా పాత మచ్చ) పోయినప్పుడు, అద్దం ముందు నిలబడి చూసుకున్నప్పుడల్లా ఉత్సాహం రెట్టింపవుతుంది.

వైద్యపరమైన సాయం లభిస్తుంది: కొందరికి ముక్కు ఆకారం వల్ల శ్వాస సమస్యలు లేదా యాక్సిడెంట్‌ వలన ఏర్పడిన మచ్చలు, ఎగుడుదిగుడులు ఉంటాయి. అలాంటివి సరిచేయడానికి శస్త్రచికిత్స శాస్త్రీయ పరిష్కారం అవుతుంది. అంటే అందం కోసమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

సహజమైన ఫలితాలు రావచ్చు: సరైన వైద్య నిపుణుల దగ్గర, సరైన పద్ధతిలో చేస్తే సర్జరీ ఫలితాలు దీర్ఘకాలం నిలిచే సహజమైన అందాన్ని తలపిస్తాయి. 

నష్టాలు!
ఫిల్టర్‌ మాయాజాలం కాపీ కాదు: డిజిటల్‌ ఫిల్టర్‌ లుక్‌ను నిజ జీవితంలో కాపీ చేయడం అసాధ్యం. ఎంత సర్జరీ చేసినా ఫలితం ఊహించినట్టుగా రాకపోవడంతో నిరాశ తప్పదు.

వైద్య సమస్యల రిస్క్‌: ప్రతి శస్త్రచికిత్సలోనూ ఇన్ఫెక్షన్లు, గాయాలు, శాశ్వత మచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖం అనేది వ్యక్తిత్వానికి ప్రతిబింబం కాబట్టి చిన్న తప్పిదం కూడా జీవితాంతం కనిపిస్తూనే ఉంటుంది.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం: ఫలితాలు కోరుకున్న మాదిరిగా రాకపోతే నిరాశ, ఆందోళన పెరిగి మానసిక సమస్యలు తలెత్తవచ్చు.

అలవాటుగా మారే ప్రమాదం: మొదట పెదవులు, తర్వాత చీక్స్, ఆపై జాలైన్‌ – ఇలా ఒకదాని తర్వాత మరొకటి చేస్తూ నియంత్రణ కోల్పోతే, చివరికి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టమే మిగులుతుంది.

ఎక్కువ చెల్లించేది సెలబ్రిటీలే!
యువతలో కొత్త ట్రెండ్‌ మొదలైంది. అదే డిజిటల్‌ ఫేస్‌ కావాలనే కోరిక! రీల్స్‌లో ఫిల్టర్స్‌తో అందంగా కనిపించే విధంగా నిజజీవితంలోనూ ఉండాలని కోరుకుంటున్నారు. ఇన్‌ స్టాగ్రామ్‌ రీల్స్, ఫొటో యాప్స్‌లో కనిపించే గ్లాస్‌ స్కిన్‌ , షార్ప్‌ జాలైన్‌ , పర్ఫెక్ట్‌ లిప్స్‌ చూసి ‘ఇదే నా ముఖం కావాలి!’అంటూ బ్యూటీ పార్లర్స్‌కు పరుగులు తీస్తున్నారు. అప్పటికీ సంతృప్తి చెందక కాస్మెటిక్‌ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. ఇరవై నుంచి ముపై ్ప ఏళ్ల వయసులో ఉన్న యువతే ఎక్కువగా రియల్‌ ఫేస్‌ ఫిల్టర్స్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో లిప్‌ ఫిల్లర్స్, నోస్‌ రీషేపింగ్, లిపోసక్షన్‌ , బోటాక్స్‌ వంటి శస్త్రచికిత్సలు ఫ్యాషన్‌ గా మారిపోయాయి.

అంతేకాదు, డిజిటల్‌ ఫిల్టర్స్‌ను నిజజీవితంలో దక్కించుకోవాలనే ఆశతో శరీర నిర్మాణం, చర్మంపై గరిష్ఠ హద్దులు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక యువతి లిపోసక్షన్‌  చేసినా ఇన్‌ స్టా వీడియోలో కనిపించిన ఫిల్టర్‌ లుక్‌ రాక నిరాశ చెందింది. మరో విద్యార్థిని పదికి పైగా లేజర్‌ సెషన్లు చేయించుకుని కూడా తాను నెట్‌లో చూసినట్టే ఫలితం రాలేదని స్కిన్‌  గ్రాఫ్ట్‌కే పట్టుబట్టింది. ఇవే ఉదాహరణలు ఈ ట్రెండ్‌ ఎంత దూరం వెళ్ళిందో చూపిస్తున్నాయి. ఇంతకుముందు అందం మెరుగుదల కోసం వచ్చేవారు, ఇప్పుడు పర్ఫెక్షన్‌  కోసం వస్తున్నారు. ఫిల్టర్‌ లుక్‌ అంటే ఎడిటింగ్, అది నిజజీవితంలో సాధ్యం కాదని డాక్టర్లు స్పష్టంగా చెబుతున్నప్పటికీ యువతలో మార్పు రాకపోగా, విపరీతంగా ఈ రియల్‌ ఫిల్టర్‌ ఫేస్‌ భ్రాంతి పెరుగుతోంది.

అతి అనర్థం!
అందంగా కనిపించాలనే ఆశతో బ్యూటీ పార్లర్‌ వెళ్లి తీసుకునే చికిత్సలు మొదట మెరిసే కాంతి ఇచ్చినా, తర్వాత సమస్యల వరదనూ సృష్టిస్తాయి. హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌తో జుట్టు మృదువుగా మారుతుంది. కాని, కొంతకాలానికి బలహీనమై రాలిపోతుంది. స్కిన్‌ పాలిష్, బ్లీచింగ్‌ వంటివి చర్మానికి తాత్కాలికంగా మెరుపునిస్తాయి. కాని తర్వాత మచ్చలు, ఎర్రదనమే మిగులుతాయి. ఇక తరచు మేకప్‌ వాడితే చర్మానికి ఊపిరాడక మొటిమలు, పొడిబారిన పెదవులు తప్పవు. ఐ లైనర్లు, మస్కారా ఎక్కువ వాడితే కళ్లకు ఇన్ఫెక్షన్లు వస్తాయి. టాటూలు స్టయిల్‌గా అనిపించినా, జీవితాంతం అలానే ఉండిపోతాయి. తొలగించాలంటే నొప్పి, ఖర్చు, ప్రమాదం ఎక్కువ. ఇక ముక్కు, చెవులకు ఆభరణాలను పెట్టుకోవాలని అనవసరంగా అనేక రంధ్రాలు చేయించుకుంటే తరచుగా ఇన్ఫెక్షన్లు, గాయాలు రావడం సహజం. ఇలా తాత్కాలిక మెరుపు కోసం చేసే ఈ చర్యలు శాశ్వత నష్టాలను కలిగిస్తాయి.

అందంగా ఉండాలని మామూలు మనుషులూ కోరుకుంటారు. అయితే, సెలబ్రిటీలకు అది బతుకుబండిని లాగించే ఆక్సిజన్‌ లాంటిది. కెమెరా ముందు ప్రతి ఏజ్‌లైన్‌ , ప్రతి ముడత, ప్రతి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రోజూ మిలియన్ల కళ్లు, కెమెరా లెన్సులు, పాపరాజ్జీ ఫ్లాష్‌లు వారిని గమనిస్తూనే ఉంటాయి. అందుకే వారు ‘ఎప్పటికీ యవ్వనంగా, నాజుకుగా కనిపించాలి’ అనే ఒత్తిడిలో జీవిస్తారు. ఈ నిరంతర ఒత్తిడి వారిని సాధారణ మనుషుల కంటే ఎక్కువగా రిస్కీ ప్రయోగాల వైపు నెట్టేస్తోంది. అందుకే ఎంతోమంది నటీనటులు, మోడల్స్, గాయకులు అందం కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో భారీ మూల్యం చెల్లించుకున్నారు. సాధారణ మనిషి చేసిన తప్పులను సమాజం పెద్దగా పట్టించుకోదు గాని, సెలబ్రిటీలు చేసిన తప్పులు మాత్రం ప్రపంచం ముందు బహిర్గతమవుతాయి. అలాంటివారిలో తీవ్రంగా నష్టపోయిన సెలబ్రిటీలు వీరే:

లిన్‌  మే – చీప్‌ అందం ఖర్చు, మొత్తం జీవితం
మెక్సికో నటి లిన్‌  మే తక్కువ ఖర్చుతో త్వరగా బాగుపడతానని నమ్మి ఇరవై డాలర్లకు ఇంజెక్షన్‌  వేసుకుంది. కాని, అది నైపుణ్యం లేని వ్యక్తి చేసిన మోసం. బేబీ ఆయిల్, కుకింగ్‌ ఆయిల్, నీరు కలిపి ఆమె ముఖంలోకి పంపించడంతో, ముఖం వాచిపోయి శాశ్వతంగా దెబ్బతింది. అనేక సర్జరీలు చేసినా ఆమె అందం తిరిగి రాలేదు.

ప్రిసిల్లా ప్రెస్లీ – సిలికాన్‌  మోసం
హాలీవుడ్‌ ఐకాన్‌  ప్రిసిల్లా ప్రెస్లీ ఒక నకిలీ వైద్యుడి వలలో చిక్కుకుంది. పరిశ్రమల్లో వాడే నాసిరకం సిలికాన్‌ ని ముఖంలో ఇంజెక్ట్‌ చేయడంతో, ఆమె అందం శాశ్వతంగా దెబ్బతింది. ఒకప్పుడు వెండితెరపై మెరిసిన ముఖం, ఇప్పుడు పశ్చాత్తాపానికి గుర్తుగా మిగిలిపోయింది.

కోర్ట్నీ కాక్స్‌ – మితిమీరిన ఇంజెక్షన్ల తలనొప్పి
‘ఫ్రెండ్స్‌’ సీరియల్‌తో ప్రపంచాన్ని అలరించిన కోర్ట్నీ కాక్స్‌ యవ్వనం నిలబెట్టుకోవాలన్న ఒత్తిడితో వరుసగా ఇంజెక్షన్లు వేసుకుంది. ఫలితంగా ముఖం సహజత్వాన్ని కోల్పోయింది. చివరికి ఆమె స్వయంగా ‘ఇదంతా నా తప్పే’ అని ఒప్పుకొని సహజ వృద్ధాప్యాన్ని అంగీకరించింది.

డొనాటెల్లా వెర్సేస్‌ – శస్త్రచికిత్సల బలి
ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్‌  డిజైనర్‌ డొనాటెల్లా వెర్సేస్‌ పలు శస్త్రచికిత్సలు చేయించుకుంది. ఆ శస్త్రచికిత్సలు ఆమె రూపాన్ని సహజంగా మెరిపించకపోగా, విరూపం చేశాయి. ప్రజలు ఇప్పుడు ఆమె కొత్త ముఖాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు.

హైడి మాంటాగ్‌ – ఒకేసారి పది ఆపరేషన్లు
అమెరికా రియాలిటీ స్టార్‌ హైడీ మాంటాగ్‌ ఒకేసారి పది సర్జరీలు చేయించుకుంది. ముక్కు సవరణ నుంచి ఫేస్‌లిఫ్ట్‌ వరకు అన్నీ ఒకేసారి. కాని, ఆ నిర్ణయం తన జీవితంలోనే పెద్ద పొరపాటు అని తర్వాత తానే ‘అవసరం లేని సమయంలో నా సహజ అందాన్ని నాశనం చేసుకున్నాను.’ అని ఒప్పుకుంది. 

కోయనా మిత్రా – విఫలమైన ముక్కు సర్జరీ
ఒకప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌తో ఫేమస్‌ అయిన కోయనా ముక్కు సర్జరీ చేయించుకుంది. కాని, అది విఫలమై, మరో పెద్ద ఆపరేషన్‌  చేయించుకోవాల్సి వచ్చింది. ఈ పొరపాటు ఆమె కెరీర్‌కే అడ్డుగీత వేసింది.

అనుష్కా శర్మ – లిప్‌ ఇంజెక్షన్ల వివాదం
అనుష్కా శర్మ లిప్‌ ఇంజెక్షన్లు పెద్ద చర్చనీయాంశ మయ్యాయి. మొదట ఆరోగ్య సమస్య కోసం చేశానని చెప్పినా, తర్వాత అది అందం కోసం చేసుకున్నదేనని అంగీకరించింది.

రాఖీ సావంత్‌ – విఫలమైన ప్రయోగాలు
రాఖీ సావంత్‌ ఎన్నో సర్జరీలు చేయించుకుంది. వాటిల్లో కొన్ని విఫలమయ్యాయి. ముఖ్యంగా లిప్, నోస్‌ జాబ్స్‌ ఆమె సహజ అందాన్ని పూర్తిగా మార్చేశాయి.

శ్రుతి హాసన్‌  – ధైర్యంగా ముందుకు
శ్రుతి హాసన్‌  ముక్కు సర్జరీ చేయించుకుంది. ఫిల్లర్లు వాడింది. ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్న వెంటనే ‘ఇది ప్లాస్టిక్‌ సర్జరీ షాప్‌’ అంటూ కామెంట్లు చేశారు. కానీ, ‘నేను ఏమి చేశానో నాకు తెలుసు. ఇంకా ఎక్కువ చికిత్సలు చేసుకున్నవారూ ఉన్నారు. గ్లామర్‌ ప్రపంచంలో చాలామంది నిజాలను దాచిపెడతారు’ అంటూ అనేక విమర్శలు ఎదురైనా, తన నిర్ణయాన్ని ధైర్యంగా సమర్థించుకుంది.

అదితిరావు హైదరి – సహజ అందానికి దగ్గరగా
అదితిరావు హైదరి పలు ట్రీట్మెంట్లు చేయించు కున్నప్పటికీ, సహజమైన అందాన్ని కాపాడుకోవ డానికి ప్రయత్నించింది. అయినా రూపంలో వచ్చిన మార్పులను అభిమానులు గమనించి ట్రోల్‌ చేశారు. 

హీరోలు కూడా!
హీరోలు కూడా అందం కోసం వెనకడుగు వేయడంలేదు. షాహిద్‌ కపూర్‌ చేయించుకున్న ముక్కు సర్జరీని అభిమానులు ఎగతాళి చేశారు. సైఫ్‌ అలీ ఖాన్‌  బోటాక్స్‌ ట్రీట్మెంట్లు తీసుకున్నట్టు బహిరంగంగానే చెప్పడంతో సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ అతన్ని ఊపిరి తీసుకోనివ్వ లేదు. ఆమిర్‌ ఖాన్‌  వృద్ధాప్య రేఖలు తగ్గించుకోవడానికి చికిత్సలు తీసుకున్నాడని వార్తలు రావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రముఖ దర్శకుడు కరణ్‌ జోహార్‌ డెర్మల్‌ ఫిల్లర్లు చేయించుకున్నట్లు బయటపడగానే అతడూ ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. సినిమా ప్రపంచం యవ్వనాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. కాని, అందం కోసం చేసిన ప్రతి ప్రయత్నం విజయవంతం కాకపోవచ్చు. కొన్నిసార్లు అందం కోసం చేసిన రిస్క్‌ పశ్చాత్తాపంగా మిగిలిపోతుందని ఈ కథలే నిరూపిస్తున్నాయి.

అందం వెనుక దాగున్న నేరాలు!
బంగారు కాంతి లాంటి చర్మం కావాలని, వయసు నిలిచిపోవాలని కలలు కనే ధనవంతుల కోరికలే కొన్ని భయంకరమైన నేరాలకు కారణమవుతున్నాయి. బయటకు మెరిసే ప్రకాశవంతమైన సెలూన్లు, సౌందర్య కేంద్రాల లోపల ఎన్నో చీకటి రహస్యాలు దాగి ఉంటాయి. కొన్ని ఉత్పత్తుల వెనుక వాస్తవాలు విస్తుగొలుపుతాయి. ఉదాహరణకు, కొన్నిసార్లు ఫేస్‌క్రీమ్‌లలోని మెత్తదనానికి చిన్నారి చర్మపు ముక్కలే మూలమని, ఒక శాశ్వత యవ్వన ఇంజెక్షన్‌ వెనుక టీనేజ్‌ యువతుల దగ్గర నుంచి బలవంతంగా తీసిన అండాలను ఉపయోగిస్తారంటే ఎవ్వరూ నమ్మలేరు.

కాని, ఇవన్నీ నిజమేనని రుజువు చేసే కథనాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రుల నుంచి దూరం చేసిన పిల్లలను బందీలుగా ఉంచి వారి శరీరాలను ప్రయోగశాలలాగా వాడేస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, లక్నో ప్రాంతాల్లో పిల్లల చర్మం, రక్తం అమ్మడం ఒక వ్యాపారంలా మారిందని బయటపడింది. ఇక నేపాల్‌లో అయితే, చిన్నారులు, టీనేజ్‌ యువతుల చర్మపు ముక్కలు కోసి కాస్మెటిక్‌ ఉత్పత్తులుగా అమ్ముతున్న దారుణ నేరాన్ని పోలీసులు బయటపెట్టారు. ఇలా తెలియకుండానే అందం వెనుక దాగి ఉన్న ఆ భయంకర నిజాన్ని బయటివాళ్లు గ్రహించలేరు. ఎందుకంటే బయట మాత్రం ‘అందం కోసం అద్భుత రహస్యం’ అంటూ మెరుస్తున్న బోర్డులు మాత్రమే కనిపిస్తాయి. లోపల మాత్రం నిస్సహాయుల ఆర్తనాదాలు వినిపిస్తాయి. 

అందం అంటే కేవలం బాహ్య రూపం కాదు. అది సహజత్వం, ఆరోగ్యం, ఆనందాల కలయిక. శరీరానికి నిజంగా అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిదే కాని, ఫొటో ఫిల్టర్స్‌లో కనిపించే కృత్రిమ అవతారాలను వెంబడిస్తే, చివరికి మిగిలేది నిరాశ మాత్రమే!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement