బురదలో సరదగా..

బురదలో సరదగా..


చదునైన రహదారిపై పరుగు కాదిది. దారి పొడవునా ఎగుడు దిగుళ్లే! ఏ దారి అయితేనేం? పరుగే కదా అని పొడి పొడిగా పెదవి విరిచేయడానికి కాదు. పరుగు తీయాల్సింది బురదమయమైన దారిలో. అడుగు తీసి అడుగేస్తే చాలు, అంతా తడి తడి చిత్తడి. అయినా సరే, బురదలో పరుగు తీయడంలోనే సరదా ఉందంటున్నారు ఔత్సాహిక సిటీజనులు. అలాంటి వారి కోసమే గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచరీ క్లబ్ (జీహెచ్‌ఏసీ) ‘హైదరాబాద్ మడ్న్’్ర మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేవారు బురదతో నిండిన ట్రాక్‌పై రెండు కిలోమీటర్ల దూరం పరుగు తీయాల్సి ఉంటుంది. ఈ పరుగులో నీటిగుంతలు, సొరంగాలు, గోడలు, వంతెనలు, టార్జాన్ స్వింగ్, బెల్లీ క్రాల్, టైర్ ఫీల్డ్ వంటి పాతిక అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. సమయంతో నిమిత్తం లేకుండా, విజయవంతంగా రెండు కిలోమీటర్ల పరుగు పూర్తి చేసుకున్న వారందరూ పతకాలు, ప్రశంసా పత్రాలు పొందవచ్చు.

 

 నడవొచ్చు.. పాకొచ్చు.. ఎగిరెగిరి దూకొచ్చు..

 బురద పరుగులో (మడ్ రన్) కొన్నిచోట్ల ఆచితూచి నడుచుకుంటూ వెళ్లొచ్చు. మరికొన్ని చోట్ల సొరంగాల గుండా బురదగుంతల్లో పాకొచ్చు. ఇంకొన్ని చోట్ల ఎగిరెగిరి దూకొచ్చు. మొత్తానికి పడుతూ, లేస్తూ... అడ్డంకులను దాటుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. లక్ష్యాన్ని చేరుకునేలోగా ఒళ్లంతా బురదమయంగా మారుతుంది. ఇదో సరదా. లక్ష్యాన్ని చేరుకున్నా, చేరుకోలేకున్నా... మొత్తానికి మడ్ రన్ భలే ఫన్ అంటున్నారు సిటీజనులు.

 

 వాక్‌బ్రిడ్జ్: రెండు చెట్ల మధ్య కట్టెలతో ఏర్పాటు చేసిన ఈ రోప్‌బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రెండున్నర అడుగుల ఎత్తునున్న ఈ బ్రిడ్జి పైనుంచి జారిపడినా, కిందనున్న బురద కారణంగా గాయాలు తగలవు.

 

 14న పరుగెడదాం.. రండి

 గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన మడ్న్ ్రనిర్వహిస్తున్నారు. ఇందులో ఎనిమిదేళ్లు పైబడిన వారు పాల్గొనవచ్చు. పదమూడేళ్ల లోపు పిల్లలు తమ పేరెంట్స్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి రావడం వల్ల మడ్న్‌న్రు ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1250. hyderabadmudrun.com లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 9849011006, 040-68888197 నంబర్‌లలో సంప్రదించవచ్చు.  పటాన్‌చెరు-శంకరపల్లి రోడ్డులోని లహరి రిసార్ట్స్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ మెగా ఈవెంట్ ప్రారంభమై, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

 

 టార్జన్ స్వింగ్: చెట్టుకు కట్టిన లావాటి తాడు కిందనున్న బురదగుంతలో వేలాడుతూ ఉంటుంది. ఆ తాడును పట్టుకుని, బురదగుంతను దాటి ముందుకు దూకాల్సి ఉంటుంది. తాడుకు, గుంతకు మధ్య మూడడుగుల దూరమే ఉండటంతో కిందపడితే ఒళ్లంతా బురదమయమవుతుంది.

 

కమాండో నెట్: లావాటి తాడుతో వలలా తయారు చేసి, ‘ఏ’ ఆకారంలో ఉంచుతారు. దీని నుంచి రన్నర్స్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. అప్పటికే బురదమయంగా మారిన రన్నర్స్ ఈ ప్రక్రియలో పట్టుజారి కింద పడుతుంటారు. ఇది పోటీ క్రీడ కాకపోవడంతో అందరూ పడుతూ లేస్తూ ఎంజాయ్ చేస్తారు.

 

 టైర్ ఫీల్డ్: భూమి మీద అరడుగు మందాన బురద ఉంటుంది. అక్కడక్కడా టైర్లు వేసి ఉంచుతారు. రన్నర్స్ ఈ టైర్ల మధ్యలో కాలు పెట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అటు బురద, ఇటు టైర్ మధ్యలో నుంచి వెళ్లటం భలే తమాషాగా ఉంటుంది. ఇక జారుడుబండ మీద నుంచి జారి కింద బురదలో పడటం వెరైటీ థ్రిల్ కలిగిస్తుంది.

 

 మడ్ రన్ అంటే సిటీ గుర్తొచ్చేలా..

మడ్ రన్‌లో సుమారు వెయ్యి మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. 2012లో తొలిసారి మెదక్‌లోని సంగారెడ్డిలో, 2013లో లహరి రిసార్ట్స్‌లో నిర్వహించాం. వచ్చే మూడేళ్లలో దీనిని నేషనల్ ఈవెంట్‌గా మారుద్దామనుకుంటున్నాం. ప్రస్తుతం పుణే, హైదరాబాద్‌లలో మాత్రమే నిర్వహిస్తున్నాం. మడ్ రన్ అంటే సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌గా అందరికీ తెలిసేలా కృషి చేస్తున్నాం.

 - సురేశ్, కో-ఆర్గనైజర్,

 గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్


 

 రోప్ ట్రవర్స్:  భూమికి రెండడుగుల పైన ఒక తాడు.. ఆ తాడుకు మరో రెండడుగులపైన ఇంకో తాడు. మొదటి తాడుపై కాలుపెట్టి, రెండో తాడును చేతపట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పట్టుతప్పి జారిపోతే, కింద ఏర్పాటు చేసిన చిన్నసైజు కాలువలో పడొచ్చు. అందులో మోకాలి లోతు నీళ్లు మాత్రమే ఉంటాయి. ఈత రాకున్నా, ఎలాంటి ప్రమాదం ఉండదు.

 

 భద్రత: ప్రతి అవరోధం వద్ద మెయిన్ మార్షల్స్, ముగ్గురు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఎవరికైనా కళ్లలో మట్టి పడినా, చిన్న గాయాలైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినందున పెద్ద గాయాలయ్యే అవకాశాల్లేవు. అయితే.. అంబులెన్స్ కూడా ఉంటుంది.

 - వాంకె శ్రీనివాస్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top