వినాయక వ్రతకల్పం | Vinayaka Chavithi Festival Celebrations | Sakshi
Sakshi News home page

వినాయక వ్రతకల్పం

Aug 29 2014 12:30 AM | Updated on Sep 2 2017 12:35 PM

వినాయక వ్రతకల్పం

వినాయక వ్రతకల్పం

ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ‘వినాయక చవితి‘

శుక్ల చవితి : వినాయకచవితి
ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ‘వినాయక చవితి‘ లేదా ‘గణేశ చతుర్థి‘ పర్వదినంగా జరుపుకుంటారు. ఈరోజున వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతోపాటు, 21 పత్రాల్తో పూజించి, వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములు తదితరములైన పిండివంటకాలు నైవేద్యంగా సమర్పించుకుని ఇంటిల్లిపాదీ ఘనంగా పండుగ జరుపుకుంటాం.
 
 ఓం మహాగణాధిపతయే నమః
 హిందూ సాంప్రదాయం ప్రకారం వినాయకుడు సకల దేవతా గణానికి అధిపతి (గణనాయకుడు), అన్ని పూజలకు ప్రప్రథమంగా పూజింపవలసినవాడు. అందుకే ప్రతి శుభకార్యానికి, పూజకు మొదటిగా మనం గణపతిపూజతోనే ప్రారంభిస్తాం. అది పిల్లవాడి బారసాల, విద్యాభ్యాసం నుండి, వివాహం, శంకుస్థాపన, గృహ ప్రవేశం, వ్యాపార ప్రారంభోత్సవాలు, నూతన వాహనం కొనుగోలు ఇలా ఒక సందర్భం ఏమిటి మానవ జీవితంలో ప్రతి ప్రధానమైన శుభకార్యానికి మొదటిగా గణపతిని పూజించటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా మన ప్రతి పని విజయానికీ, చదువుకు, జ్ఞానానికీ దిక్కైన దేవుడు మన వినాయకుడు. అందుకే మనం మొదలుపెట్టే ప్రతి ముఖ్యమైన పని ఎటువంటి విఘ్నాలు కలగకుండా విజయవంతంగా జరగాలని వినాయకుని ప్రార్తిస్తూ ఉంటాం. ముందుగా వినాయకుడిని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా సకల కార్యాలు పొంది, ఐశ్వర్యాలు సిద్ధించి కష్టాలు దూరమవుతాయని ప్రజల విశ్వాసం. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుడు జన్మించినది. అన్ని విఘ్నాలపై ఆధిపత్యం జరిగినట్లుగా పురాణాలబట్టి పండితులు తెలుపుతున్నందున మనదేశంతోపాటు ఇతర దేశాలలోని వారు కూడా ప్రతి సంవత్సరము భాద్రపదశుద్ధ చవితినాడు, బంగారం, వెండి మట్టితో తయారుచేసిన ప్రతిమలకు కుటుంబసభ్యులు అందరూ పూజించటం వల్ల మంచి ఫలితాలు అందుతాయని పురాణకథలు తెలుపుచున్నాయి.
     మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం వలన కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి. వ్యవసాయ అభివృద్ధి కలుగు తుంది. బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధిని, వెండి ప్రతిమ ఆయురారోగ్యాన్నీ, రాగి ప్రతిమ సంకల్పసిద్ధిని, శిలా ప్రతిమ మోక్ష, జ్ఞానాలను అనుగ్రహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
 
 విఘ్నేశ్వరుని పూజద్రవ్యములు
 (శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)
 పూజా ద్రవ్యములు ః వినాయక ప్రతిమ, పత్రికలు, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పళ్ళు, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పంచపాత్ర, ఉద్ధరిణి. పళ్ళెం, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు, పాలవెల్లి. ప్రత్తిచే చేయబడు వస్త్రములు, మామిడి తోరణాలు,  దేవునికి తగిన పీఠము.
 నైవేద్యం ః ఉండ్రాళ్లు-21, వడపప్పు, పానకం, అటుకులు, బెల్లం, అరటి ఇతర పళ్ళు, పిండివంటలు మొదలగునవి.
 పూజాపత్రి ః మాచి, బలురక్కసి లేక ములగ, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్దె, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రికలు సంపాదించి ఆయా మంత్రములతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపము కల్గినను భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రికలు సకాలములో లభ్యముకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.
 పాలవెల్లి పూజ ః శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠమునకు పై భాగమున పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రి తోను శోభాయమానంగా అలంకరించాలి. దీనినే మనము సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.
 పూజా మందిరములో ః విద్యార్థులైతే శ్రీ విఘ్నేశ్వర స్వామితో పాటు శ్రీ సరస్వతీదేవి పటమును, తమ పాఠ్యపుస్త కాలు, పెన్ను, పెన్సిల్. వ్యాపారస్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామితోపాటు శ్రీలక్ష్మీ అమ్మవారి ఫొటోను, వారి లెక్కల పుస్తకాలు, ఏ వ్యాపారం చేస్తుంటే ఆ వస్తువులు, వ్యవసాయదారులైతే జమాఖర్చుల వివరాలు ఉంచుకోవచ్చు. పూజానంతరంక పసుపు, కుంకుమతో ఆయా వస్తువులకు బొట్టుపెట్టి అక్షతలు వేసి నమస్కరించాలి.
 
 గణేశుని పూజ.. పూజకు ఏర్పాట్లు
 ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద  శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగమున పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపుతో వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.
 ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
 దీపారాధన :  (ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)
 శ్లో॥    భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‌
     యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ॥
     దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు॥

 పరిశుద్ధి : (పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బ్రొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)
 అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!
 యస్మరేత్ పుండరీకాక్షం సుబాహ్యాంతరశ్శుచిః
 పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః
 శ్రీరస్తు    శుభమస్తు అవిఘ్నమస్తు
 
 విఘ్నేశ్వరుని వ్రతకల్పము
 గణేశాయ నమః     శ్లో॥    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
         ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ॥
         అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
         అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ॥
 శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః
     శ్లో॥    సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః
         లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
         ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
     వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః
     షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిః
     విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,
     సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ॥

 ఓం కేశవాయ స్వాహా
 నారాయణాయ స్వాహా
 మాధవాయ స్వాహా
 (అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి)
 గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః
 త్రివిక్రమాయ నమః వామనాయ నమః
 శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః
 పద్మనాభాయ నమః దామోదరాయ నమః
 సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః
 ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః
 పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః
 నారసింహాయ నమః అచ్యుతాయ నమః
 జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః
 హరయే నమః శ్రీ కృష్ణాయ నమః
 (రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)
     శ్లో॥    ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! ఏతే భూమి భారకాః
         ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!
     (ముక్కుపట్టుకుని ఈ క్రింది మంత్రం చెప్పవలెను)
     ఓం భూః ఓం భువః ఓగ్‌ం సువః ఓం మహః ఓం జనః
 ఓం తపః ఓగ్‌ం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య
 ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌॥ఓమాపో జ్యోతి
 రసోమృతం బ్రహ్మభూర్భువస్సురోమ్‌॥
     సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా
 శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞేయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమవసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ జయనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష బుుతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థి తిథౌ భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ గోత్రః.......................... (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సకుటుంబస్య  క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధనకనక విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట ఫల సిద్థ్యర్థం, పుత్రపౌత్రాభి వృద్థ్యర్థం, శ్రీ గణపతి దేవతా ముద్దిశ్య
 శ్రీ గణపతి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే॥
 (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచితీయవలెను)
 తదంగ కలశపూజాం కరిష్యేః
 (మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో ముంచితీయవలెను)
 (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)
 శ్లో॥    కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రీతః
     మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
     కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా!
     ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః
     అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రీతః
     గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి!
     నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ॥
     అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః
 కలశోదకేన పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్యః దేవమాత్మానం సంప్రోక్ష్యః
 (కలశమునందలి నీటిని పూజా ద్రవ్యములపై చల్లి శిరస్సుపై చల్లవలెను)
 (పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)
 శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్ప యామి (నమస్కరించవలెను)
     గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనా
     ముపమశ్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణాస్పత
     ఆనసృణ్వన్నూతిభిస్సీదసాదనం
 ఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)
 పాదయోః పాద్యం సమర్పయామి  (మరల నీటిని చల్లవలెను)
 హస్తయోః అర్ఘ్యం సమర్పయామి !! (మరల నీటిని చల్లవలెను)
 ముఖే ఆచమనీయం   సమర్పయామి !!
 (మరల నీటిని చల్లవలెను)
 ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)
 స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
 వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)
 గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)
 గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి
 (అక్షతలు చల్లవలెను)
 కుంకుమం సమర్పయామి !!
 పుష్పాని సమర్పయామి    (పూలతో స్వామివారిని అలంకరించవలెను)
 పుష్పైపూజయామి
 (ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పములతో పూజ చేయవలెను)
 ఓం సుముఖాయ నమః    ఓం ఏకదంతాయ నమః
 ఓం కపిలాయ నమః    ఓం గజకర్ణకాయ నమః
 ఓం లంబోదరాయ నమః    ఓం వికటాయ నమః
 ఓం విఘ్నరాజాయ నమః    ఓం గణాధిపాయనమః
 ఓం ధూమకేతవే నమః    ఓం గణాధ్యక్షాయ నమః
 ఓం ఫాలచంద్రాయ నమః    ఓం గజాననాయ నమః
 ఓం వక్రతుండాయ నమః    ఓం శూర్పకర్ణాయ నమః
 ఓం హేరంబాయ నమః    ఓం స్కంద పూర్వజాయ నమః
 ఓం మహాగణాధిపతయే నమః
 నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి
 (పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)
 ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)
 దీపం దర్శయామి (దీపమును చూపవలెను)
 నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)
 ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‌॥సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను).
 ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా,
 ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా,
 ఓం సమానాయ స్వాహా
 శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం
 గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)
 మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
 హస్తప్రోక్షయామి, పాదవ్ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)
 తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)
 ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)
 ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి
 (కర్పూరమును వెలిగించాలి)
     శ్లో॥    వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
         అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥
     శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
     గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో  భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
     (గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.)
 శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి
 (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)
 
 వరసిద్ధి వినాయక పూజా ప్రారంభం
 స్వామిన్, సర్వజగన్నాధ యావత్పూజావసానగా ః
 తావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురు
 ధ్యానం : స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి)
 ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధ కారభాస్వంతం విఘ్నరాజ మహం భజే॥ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‌॥ఉత్తమం గణనాథస్య వ్రతం సంప త్కరం శుభం ॥భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ॥ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి.
 ప్రాణ ప్రతిష్టః (స్వామి వారికి ప్రాణం పోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‌ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత మనుమతే మృడయానస్వస్తి అమృతం నై ప్రాణాః  ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ॥స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‌ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు॥సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద॥
     ఆవాహనమ్ : స్వామి వారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి॥
     ఆసనమ్ : స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి).
     మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహా సనంచారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి॥
     పాద్యమ్ : స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుచ్చున్నట్లు భావించటడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానవ॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి॥
     అర్ఘ్యమ్ : స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి) గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం॥
 శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి॥
     ఆచమనీయమ్ : స్వామి వారి నోటికి నీళ్ళు అందించడం త్రాగుచున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి॥
     మధుపర్కం : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ॥మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.
     పంచామృత స్నానమ్ : పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృ తాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)
     పాలు : ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృషిణ యం భవా వాజన్య సంగథే॥శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి॥
     పెరుగు : ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‌ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‌॥
 శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి॥
     నేయి : ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి॥
     తేనె : ఓం మధువాతా బుుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ! మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః మధుద్యైరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‌ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి॥
     పంచదార : ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయమే బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి॥
     (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత॥
 శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి.
     ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి)
 యాః ఫలినీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి॥
     శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకంచేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి॥స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి॥(అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను  బట్టతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.)
     వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ॥ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి॥
     యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి॥
     గంధమ్ : (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామి.
     అక్షతలు : (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్‌ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి॥
     పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాలవద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అథాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి.)
  సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి॥
 అథాంగ పూజా :
 (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)
 గణేశాయ నమః    పాదౌ పూజయామి
 ఏకదంతాయ నమః    గుల్ఫౌ పూజయామి
 విఘ్నరాజాయ నమః    జానునీ పూజయామి
 కామారిసూనవే నమః    జంఘే  పూజయామి
 ఆఖువాహనాయ నమః    ఊరూ పూజయామి
 హేరంబాయ నమః    కటిం పూజయామి
 లంబోదరాయ నమః    ఉదరం పూజయామి
 గణనాథాయ నమః    హృదయం పూజయామి
 స్థూలకంఠాయ నమః    కంఠం పూజయామి
 పాశహస్తాయ నమః    హస్తౌ పూజయామి
 గజవక్త్రాయ నమః    వక్త్రం పూజయామి
 విఘ్నహంత్రే నమః    నేత్రౌ పూజయామి
 శూర్పకర్ణాయ నమః    కర్ణౌ పూజయామి
 ఫాలచంద్రాయ నమః    లలాటం పూజయామి
 సర్వేశ్వరాయ నమః    శిరః పూజయామి
 శ్రీ గణాధిపాయ నమః    సర్వాణ్యంగాని పూజయామి॥
 ఏకవింశతి పత్ర పూజ
 (పత్రికలు సమర్పిస్తూ పూజించాలి.)
 - సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచి ఆకు)
 - గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి    
 (బలురక్కసి లేక ములగ)
 - ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి    (మారేడు)
 - గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి     (గరికె రెమ్మలు)
 - హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి (ఉమ్మెత్త ఆకు)
 - లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి (రేగు ఆకు)
 - గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి     (ఉత్తరేణి)
 - గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి (తులసి)
 - ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి(మామిడి ఆకు)
 - వికటాయనమః కరవీర పత్రం పూజయామి     (గన్నేరు ఆకు)
 - భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి(విష్ణు క్రాంతం)
 - వటవే నమః దాడిమీ పత్రం పూజయామి  (దానిమ్మ)
 - సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి     (దేవదారు)
 - ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి (మరువం)
 - హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి (వావిలాకు)
 - శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి తీగ ఆకు)
 - సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (దేవకాంచనం)
 - ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి ఆకు)
 - వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి  (రావి ఆకు)
 - సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (తెల్లమద్దె)
 - కపిలాయ నమః అర్కపత్రం పూజయామి  (జిల్లేడు ఆకు)
 శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి॥        (21 రకముల ఆకులకు కలిపివేసి నమస్కారము చేయవలెను)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement