విలన్‌కు ఓకే! | The villain is okay! | Sakshi
Sakshi News home page

విలన్‌కు ఓకే!

Feb 2 2015 1:27 AM | Updated on Sep 2 2017 8:38 PM

విలన్‌కు ఓకే!

విలన్‌కు ఓకే!

సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు జైలు గోడలు చూసిన హీరో సంజయ్‌దత్ ఆ తరువాత బాగా మారిపోయినట్టున్నాడు.

సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు జైలు గోడలు చూసిన హీరో సంజయ్‌దత్ ఆ తరువాత బాగా మారిపోయినట్టున్నాడు. అప్పుడప్పుడూ బయటకు వచ్చి అందుబాటులో ఉన్న సినిమాలన్నీ చేసేస్తున్న ఇతగాడు... పూర్తిగా రూటు మార్చినట్టున్నాడు. హీరో అవకాశాల కోసం చూడకుండా... వచ్చినవి వచ్చినట్టు ఓకే చేస్తున్నాడు. అగ్నిపథ్‌లో విలన్‌గా చేసిన ఈ బాహుబలి... ఇప్పుడూ అదే బాటలో వెళుతున్నాడు.

కరణ్ మల్హోత్రా తీస్తున్న ‘శుద్ధి’ సినిమాలో విలన్‌గా చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది జూలై- ఆగస్టుల్లో ఎర్రవాడ జైలు నుంచి సంజయ్ బయటకు వచ్చే అవకాశాలున్నాయి. వచ్చిన తరువాత ఇదే తొలి చిత్రం అవుతుంది. కరణ్‌జోహార్ దీనికి నిర్మాత. సల్మాన్ హీరో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement