చేనేత షో యగం | Textiles Show | Sakshi
Sakshi News home page

చేనేత షో యగం

May 9 2015 3:30 AM | Updated on Sep 3 2017 1:40 AM

చేనేత షో యగం

చేనేత షో యగం

సిటీవాసులను పలకరించింది. కుషాయిగూడలోని ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు ఎస్‌ఎస్‌ఐసీ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం పోచంపల్లి ఇకత్ ఆర్ట్

పోచంపల్లి వస్త్ర సోయగం..
 
సిటీవాసులను పలకరించింది. కుషాయిగూడలోని ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు ఎస్‌ఎస్‌ఐసీ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శుక్రవారం పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాను టాలీవుడ్ నటి హాసికా దత్ ప్రారంభించింది. ష్యాషన్ లుక్.. ట్రెడిషనల్ మార్క్.. ఈ రెండూ చేనేత వస్త్రాల్లోనే కనిపిస్తాయన్నారామె. తాను కూడా చేనేత వస్త్రాలను ఇష్టంగా ధరిస్తానని చెప్పారు.
 
ఈ నెల 17 వరకు కొనసాగే ప్రదర్శనలో.. డిజైనర్ శారీస్, సిల్క్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కుర్తాలు, టేబుల్ లెనిన్ వంటి రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది.
     - కుషాయిగూడ
 

Advertisement
 
Advertisement
Advertisement