ఆటతో ఆసరా | Television star given funds to vizag | Sakshi
Sakshi News home page

ఆటతో ఆసరా

Oct 31 2014 11:58 PM | Updated on Sep 2 2017 3:39 PM

ఆటతో ఆసరా

ఆటతో ఆసరా

తెలుగింటిని అలరించే బుల్లితెర స్టార్లు చేతులు కలిపారు. హుదుద్ దెబ్బకు తల్లడిల్లిన బాధితులకు మేమున్నామంటూ బాసటగా నిలిచారు.

తెలుగింటిని అలరించే బుల్లితెర స్టార్లు చేతులు కలిపారు. హుదుద్ దెబ్బకు తల్లడిల్లిన బాధితులకు మేమున్నామంటూ బాసటగా నిలిచారు. తమవంతు సాయంగా వారి ఒక రోజు రెమ్యునరేషన్‌ను అందించారు. వారికి సినీ నటులూ జత కలిశారు.

రెండు టీమ్‌లుగా విడిపోయి ‘సేవ్ వైజాగ్’ ఫండ్ రైజింగ్ పేరుతో అబ్దుల్లాపూర్‌మెట్ సెయింట్ మేరీ కాలేజీలో క్రికెట్ ఆడారు. కాలేజీ విద్యార్థులు ఆసాంతం ఆస్వాదించిన ఈ మ్యాచ్‌లో టీవీ స్టార్స్ జట్టు.. సినిమా స్టార్స్‌పై విజయం సాధించింది. జబర్దస్త్ రాకెట్ రాఘవ ఆటల్లో అరటి పండులా అలరించాడు. లోహిత్, అనిల్, ప్రదీప్ తదితరులు మధ్య మధ్యలో జోష్ నింపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement