ఆ సినిమా జంట పెళ్లి నిజమేనా? | Love birds on Screen | Sakshi
Sakshi News home page

ఆ సినిమా జంట పెళ్లి నిజమేనా?

Jun 14 2014 3:49 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఆ సినిమా జంట పెళ్లి నిజమేనా? - Sakshi

ఆ సినిమా జంట పెళ్లి నిజమేనా?

సినిమా హీరోహీరోయిన్స్ కలసి రెండు చిత్రాలలో నటించి, రెండుసార్లు కలిసి తిరిగితే చాలు వారి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగిపోవడం సహజం.

సినిమా హీరోహీరోయిన్స్ కలసి రెండు చిత్రాలలో నటించి, రెండుసార్లు కలిసి తిరిగితే చాలు వారి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగిపోవడం సహజం. వారి మధ్య డేటింగ్ అని, ప్రేమ అని, త్వరలో పెళ్లి అని, ఇంకా ఏదోదే ప్రచారం జరిగిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ ప్రచారంలో నిజం ఉంటుంది. కొన్ని సందర్భాలలో అసలు వారి మధ్య ఏముందో ఎప్పటికీ తెలియదు. వారు అలా కలసి నటిస్తూనే ఉంటారు. కలిసి తిరుగుతూనే ఉంటారు. ఒక్కోసారి వారు తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తుంటారు. లేదా తాము మంచి స్నేహితులమని సెలవిస్తుంటారు.

బాలీవుడ్లో ఓ సినిమా జంట మధ్య ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ రొమాంటిక్ హీరో ప్రియరాలితో చెట్టాపట్టాలేసుకొని చక్కెర్లు కొడుతున్నాడని సమాచారం. స్క్రీన్ మీద, బయట కూడా వారు ప్రేమపక్షుల్లా విహరిస్తున్నారు. అంతే కాకుండా వారు ఇద్దరూ జంటగా వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. ఇక ఊహలకు అంతేముంటుంది. ప్రచారానికి హద్దు ఏముంటుంది.  ఇంతకీ వారు ఎవరని అనుకుంటున్నారా? అదేనండి తెలుగులో వెంకటేష్ సరసన మల్లీశ్వరి చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ముద్దుగుమ్మ కత్రిన కైఫ్. బాలీవుడ్ హీరో  రణభీర్‌ కపూర్.  వీరిద్దరూ అజబ్‌ ప్రేమ్‌కీ ఘజబ్‌  కహానీ, రాజనీతి  చిత్రాల్లో కలసి నటించారు. ఈ చిత్రాల షూటింగ్‌ సమయంలోనే వారు ప్రేమలోపడ్డారని వార్తలోచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తున్నట్లు  ఈ జంట అన్నీ చోట్లకు చెట్టాపట్టాలేసుకోని తిరిగేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య అదిగో పెళ్ళి ఇదిగో పెళ్ళి అంటూ నానా హాడావుడి చేశారు. ఇప్పడు ఈ జంట ముచ్చటగా మూడోసారి మళ్ళీ 'జగ్గా జాసూస్‌'  అనే మూవీ  కలసి నటించనున్నారు.

జగ్గా జాసూస్‌ చిత్రంలో రణభీర్‌ 18 ఎళ్ళ కుర్రోడిగా కనిపించనున్నారు. అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 80 శాతం పూర్తి అయిన ఈ సినిమాలో రణభీర్‌కి సవతి తండ్రి పాత్రలో గోవిందా నటిస్తున్నారు. ఇందులో రణభీర్‌ మెదటిసారిగా డిటెక్టివ్‌ పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాతో  అనురాగ్‌ బసుతో కలసి రణభీర్  నిర్మాతగా మారనున్నడం మరో విశేషం‌. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఏమిటంటే మొత్తం 25 పాటలతో దీనిని తెరకెక్కించనున్నారు.

రణభీర్-కత్రిన జంటగా నటిస్తున్నారు. జంటగా తిరుగుతున్నారు. ఇంతకీ పెళ్లి ఎప్పుడో చెప్పడంలేదు. దాంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. వారు ఇద్దరూ నోరు విప్పితేగానీ ఈ ఉత్కంఠకు తెరపడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement