హృద్రోగులు ఇవి చెక్‌ చేసుకోవాలి

 Heart patients should monitor cholesterol regularly - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: హృద్రోగులు తరచూ చెడు కొలెస్ర్టాల్ లెవెల్స్‌ను పరీక్షించుకోవాలని, గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఎల్‌డీఎల్‌ (చెడు కొలెస్ర్టాల్‌)పై కన్నేసి ఉంచాలని తాజా అథ్యయనం పేర్కొంది. గుండె పోటు, స్ర్టోక్‌ బారినపడ్డ రోగుల్లో కొవ్వు స్థాయిలను పరీక్షించుకోని వారిలో తదుపరి స్ర్టోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ అథ్యయనంలో వెల్లడైంది.

గుండె జబ్బులతో బాధపడుతున్న 66 ఏళ్ల సగటు వయసున్న 60,000 మందిపై ఈ అథ్యయనం నిర్వహించగా, కొలెస్ర్టాల్‌ను అదుపులో ఉంచే మందులు తీసుకుంటున్న వారితో పోలిస్తే ఎల్‌డీఎల్‌ను అసలు పరీక్షించుకోని వారిలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నట్టు తేలింది.

కొలెస్ర్టాల్‌ చెకప్‌ ప్రాధాన్యత కీలకంగా మారిందని అథ్యయనానికి నేతృత్వం వహించిన ఇంటర్‌మౌంటెన్‌ మెడికల్‌ సెంటర్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్ర్‌ కిర్క్‌ యూ నోల్టన్‌ చెప్పారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top