ఫ్రెండ్‌షిప్ డే ఇలా కూడా.. doggies డే అవుట్ | Doggies day out: We can make Friendship | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్‌షిప్ డే ఇలా కూడా.. doggies డే అవుట్

Aug 3 2014 2:10 AM | Updated on Sep 29 2018 4:26 PM

ఫ్రెండ్‌షిప్‌డే రోజు ఏం చేస్తారు! ఫ్రెండ్స్‌కి కాల్ చేసి విష్ చేస్తారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అభిమానంగా బ్యాండ్స్ కడతారు. ఈ రొటీన్ సెలబ్రేషన్‌కి చెక్ పెట్టండి. కుక్క విశ్వాసం కలిగిన జంతువే కాదు..

ఫ్రెండ్‌షిప్‌డే రోజు ఏం చేస్తారు! ఫ్రెండ్స్‌కి కాల్ చేసి విష్ చేస్తారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే  అభిమానంగా బ్యాండ్స్ కడతారు. ఈ రొటీన్ సెలబ్రేషన్‌కి చెక్ పెట్టండి. కుక్క విశ్వాసం కలిగిన జంతువే కాదు... మనిషి ప్రియనేస్తం కూడా. అలాంటి నేస్తానికి ఈ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా సాయం చేసి, మీ సహృదయతను తెలియజెప్పమంటోంది గ్రూప్ ఆన్ ఇండియా. వీధికుక్కల సంక్షేమం, పునరావాసం కోసం ఎన్జీవో ఫ్రెండికోస్‌తో భాగస్వామ్యమైన ఈ సంస్థ.. ఈ స్నేహితుల దినోత్సవాన వీధి కుక్కలను కాపాడి లేదంటే వైద్యమందించి మీ ఔదార్యాన్ని చాటుకొమ్మంటోంది.
 
 ఇందుకోసం 99 రూపాయల నుంచి 499 రూపాయల వరకు ప్యాకేజెస్‌ను అందిస్తోంది. ఇందుకోసం http://gr.pn/1nLFctk లో లాగాన్ అవ్వాలి. అందులో మీరు డీల్ కుదుర్చుకోవాలనుకున్న ప్రైస్ మీద క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయండి. అంతే... 99 రూపాయలకయితే మీరు కాపాడిన కుక్కకు మంచి ఆహారం అందిస్తారు. ఇక 299 రూపాయలతో డీల్ కుదుర్చుకుంటే ఫస్ట్‌ఎయిడ్, వ్యాక్సినేషన్‌తోపాటు దానికి ఫ్లూయిడ్స్ కూడా ఇస్తారు. ఇక 499 రూపాయల డీల్ అయితే గాయపడిన డాగీని కాపాడేందుకు అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ డీల్ కాలపరిమితి ఈ నెల 25.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement