నానా సిక్స్ ప్యాక్! | Chel mischievous cheek! | Sakshi
Sakshi News home page

నానా సిక్స్ ప్యాక్!

Jan 6 2015 2:47 AM | Updated on Nov 6 2018 4:55 PM

నానా సిక్స్ ప్యాక్! - Sakshi

నానా సిక్స్ ప్యాక్!

క్యారెక్టర్ డిమాండ్ చేసిందో... లేదంటే నాకేంటి తక్కువనుకున్నాడో...

క్యారెక్టర్ డిమాండ్ చేసిందో... లేదంటే నాకేంటి తక్కువనుకున్నాడో... బాలీవుడ్ నటుడు నానాపటేకర్ లేటు వయసులో సిక్స్ ప్యాక్ బాటపట్టాడు. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లే అలవాటున్నా.. ఇప్పటివరకూ ఆ ప్రయత్నం చేయలేదు ఈయన. రీసెంట్‌గా ఆమిర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, హృతిక్‌రోషన్, అజయ్‌దేవ్‌గణ్ వంటి స్టార్లకు సిక్స్ ప్యాక్ సమకూర్చిన ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా యాభై ఏళ్ల నానాకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడట. ‘యాభై ఏళ్ల తరువాత సిక్స్ ప్యాక్ రాబట్టాలంటే కొంత కష్టమే. ఈ వయసులో జీవన క్రియ మందగిస్తుంది. అయినా నానాకు శిక్షణ ఇచ్చేందుకు రెడీ. ఆయనతో పనిచేయడం నిజంగా గొప్ప అనుభూతినిస్తుంది’ అన్నాడు సత్యజిత్. సో... లెట్స్ వెయిట్ ఫర్ ‘సిక్స్ ప్యాక్ నానా’.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement