‘పుస్తకం లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది’ అంటారు రోమ్ ప్రముఖ తత్వవేత్త మార్కస్ టులియస్ సిసెరో. ఓ మంచి పుస్తకం విజ్ఞానం, వికాసం వైపు నడిపిస్తుంది. కానీ ప్రస్తుత హైటెక్ యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. విస్తృతమైన ఇంటర్నెట్, విరుచుకుపడుతున్న గాడ్జెట్స్.. పుస్తకం తెరిచే సమయమే ఉండటం లేదు నేటి తరానికి. ఈ పరిస్థితిని కొంతైనా మార్చి పుస్తకానికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ‘యానిమల్ రీహాబిలిటేషన్ ప్రొటెక్షన్ ఫ్రంట్’(ఏఆర్‌పీఎఫ్) వారు.
ఏటా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద పిల్లలకు వివిధ రకాల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. వారిని బుక్ రీడింగ్ వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, మురికి వాడల్లోని పిల్లలు, వారి తల్లిదండ్రులకు పుస్తకం ప్రాముఖ్యాన్ని తెలిపేలా క్యాంపెయిన్ చేపట్టారు. విజ్ఞాన, వినోద పుస్తకాల గురించి వారికి వివరించారు. జంతు సంరక్షణ, భూ సంరక్షణ, జనరల్నాలెడ్జ్ తదితర బుక్స్‌ను పంపిణీ చేశారు. వాటితో పాటు పెన్సిల్స్, పెన్స్ పంచిపెట్టారు.
‘అంతటితోనే మా మిషన్ ఆగిపోదు. ఆయా ప్రాంతాల్లో విద్యపై ఆసక్తి ఉండి, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చదువుకోలేని వారిని బడిలో చేర్పిస్తున్నాం. జీవితానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు, వాటి రచయితల విశిష్టతను పిల్లలకు తెలియజెబుతూ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాం’ అంటూ చెప్పారు సంస్థ నిర్వాహకుడు నిహార్. ఈ సామాజిక సేవలో నిహార్‌కు తోడుగా ఎంతో మంది వాలంటీర్లు జతకలిశారు. ‘పుస్తకం, విద్య, జీవజాలం, భూమి.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలంటే వీటి ప్రాధాన్యం నేటితరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటారు టీం మెంబర్స్.
- సిరి
రీడ్ అండ్ లీడ్
Published Wed, Apr 22 2015 10:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement