భారత్‌, చైనా నుంచే నయా బిలియనీర్లు

75% of the worlds new billionaires are from India and China

సాక్షి,న్యూఢిల్లీ: ఆసియా నుంచి బిలియనీర్లుగా ఎదుగుతున్న వారి సంఖ్య తొలిసారిగా అమెరికాను అధిగమించింది. బిలియనీర్ల సంపదలో అమెరికా ఇప్పటికీ ముందున్నా నయా బిలియనీర్ల సంఖ్యలో మాత్రం ఆసియా దేశాలు టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి. చైనాలో ప్రతి మూడు వారాలకు ఒక బిలియనీర్‌ తయారవుతూ ఆసియా సత్తాను చాటుతున్నాడు. ఇదే వేగంతో ఆసియా ముందుకెళితే నాలుగేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక సంపద పోగుపడ్డ ప్రాంతంగా అమెరికాను అధిగమించి ఆసియా ముందుకొస్తుందని యూబీఎస్‌, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌ అంచనా వేసింది.

ప్రపంచంలో నయా బిలియనీర్లలో 75 శాతం మంది చైనా, భారత్‌ల నుంచే ఆవిర్భవించారని ఈ అంచనా వెల్లడించిది. ప్రపంచ బిలియనీర్లలో ఆసియన్‌ బిలియనీర్లు 637 కాగా, వీరిలో 117 మంది కొత్తగా బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. తాజా జాబితాలో ఆర్ట్‌, స్పోర్ట్స్‌ దిగ్గజాలకు చోటు దక్కడం గమనార్హం. ప్రపంచంలోనే టాప్‌ 200 ఆర్ట్‌ కలెక్టర్స్‌లో 75 శాతం బిలియనీర్లున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 140 ప్రముఖ స్పోర్ట్స్‌ క్లబ్‌లను 109 మంది బిలియనీర్లు నిర్వహిస్తున్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top