చారెడేసి చానెల్‌

Youtube Cooking Channel Story - Sakshi

టైనీ టేల్‌ 

ఒక  అన్నా.. చెల్లి. 
చెల్లి వచ్చి ‘అన్నా.. ఈ రోజు కొత్త వంటకం నేర్చుకున్నాను’ అని చెప్పింది. 
‘ఓహ్‌.. నాకూ నేర్పించు’ అన్నాడు అన్న. 
అలా రోజూ   రకరకాల కొత్త   వంటకాల గురించి ఈ  అన్నాచెల్లెళ్లిద్దరూ తెలుసుకొని..నేర్చుకొని.. పదిమందికీ నేర్పించే పని పెట్టుకున్నారు ‘ది టైనీ ఫుడ్‌’ అనే యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా.

 టైనీ పేరుకు తగ్గట్టే ఆ చానెల్‌ వీడియోల్లో కనిపించే వంట సామాగ్రి అంతా బొమ్మలాటలో ఉండే బొమ్మల్లాగే చిన్నగా ఉంటాయి. చిన్న మట్టిపొయ్యి. దానికి సరిపోయే చిన్న చిన్న మట్టి పాత్రలు.. అంతే చిన్న మట్టి బాండీ..  బుజ్జి పెనం.. బుల్లి అప్పడాల కర్ర, అట్ల కాడ, చిన్న చిన్న చెంచాలు.. అన్నీ మట్టివే. అచ్చంగా బొమ్మలాట చూస్తున్నట్టే ఉంటుంది. ఈ యూట్యూబ్‌ చానెల్‌కు జపాన్‌ కుకింగ్‌ చానెల్సే స్ఫూర్తి. స్థానిక సంప్రదాయ వంటకాల నుంచి ప్రపంచ నలుమూలలకు చెందిన వంటకాల వరకు అన్నిటినీ చేసి చూపిస్తూంటారు ఈ చానెల్‌లో. ఆట వస్తువుల్లాంటి పాత్రలతో వంటలు చేయడం సరే.. ఆ వంటలను ఎలా చేయాలో వివరించే ఈ అన్నాచెల్లెళ్లూ బొమ్మలే. తోలు బొమ్మలు!

మరి ఈ చానెల్‌ నిర్వహిస్తున్నదెవరంటారా? తమిళనాడుకు చెందిన వాలర్మతి, రామ్‌కుమార్‌ అనే దంపతులు. వాలర్మతి ఉద్యోగిని. రామ్‌కుమార్‌ది గోల్డ్‌లోన్‌ బిజినెస్‌. వారంతంలో ఈ యూట్యూబ్‌ వంటల చానెల్‌ పని పెట్టుకుంటారు. 
‘కుకింగ్‌ అంటే మా ఇద్దరికీ  ఆసక్తే. అయితే యూట్యూబ్‌ చానెల్‌ ఆలోచన వచ్చింతర్వాత.. కాస్త వెనకడుగు వేశాం. ఇప్పటికే బోలెడు వంటల చానెళ్లున్నాయి. వాళ్లందరికన్నా కొత్తగా ఉండాలి అనుకున్నాం. అప్పుడే జపాన్‌కు చెందిన ఈ టైనీ చానెల్స్‌ కంటపడ్డాయి. రెండు పప్పెట్స్‌ను తయారు చేసి.. షెఫ్స్‌గా అవి వివరిస్తుంటే నేను వంట చేయడం.. అన్నట్టుగా ప్లాన్‌ చేశాం. సక్సెస్‌ అయింది. కాని ఎంత కష్టమో తెలుసాండీ.. చిన్న చిన్న వంట పాత్రలతో వంట చేయడం?ఎన్నిసార్లు చేయి కాల్చుకున్నానో! ’అంటుంది వాలర్మతి. 

ఈ చానెల్‌కు ఏడు లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారట.  ఇదీ ‘ది టైనీ ఫుడ్‌’ యూట్యూబ్‌ కుకింగ్‌ చానెల్‌ టేల్‌.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top