
పిల్లల్ని పుస్తకాల పురుగుల్ని చేయకండి...
పరీక్షలలో నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకోమని వారిపై ఒత్తిడి పెడుతుంటారు చాలా మంది తలిదండ్రులు....
కేరెంటింగ్
పరీక్షలలో నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకోమని వారిపై ఒత్తిడి పెడుతుంటారు చాలా మంది తల్లిదండ్రులు. అలా చేయడం వల్ల వారు పుస్తకాల పురుగులుగా తయారు కావడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. అంతకంటే, కొత్త కొత్త విషయాలను, పరిసరాల విజ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని అబ్బేలా చేయడం మరింత ప్రయోజనకరం.
⇒ ఆధునిక టెక్నాలజీ నుంచి ప్రాచీన నాగరకతల వరకు ప్రతి సంగతినీ తెలుసుకోవాలన్న ఆసక్తి కొందరిలో ఉంటుంది.
⇒ మన వృత్తివ్యాపారాలకు అవసరం ఉన్నా లేకపోయినా కొత్త విషయాలు తెలుసుకోవాలి. కనీసం వాటి గురించిన ప్రాథమిక సమాచారమైనా తెలిసుండాలని మీ పిల్లలకు తెలియజెప్పండి.
⇒ ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్ బ్రౌజ్ చే యడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగం, సాంకేతిక రంగాలలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త పరిశోధనల వివరాలను మీ పిల్లలు తమంతటతాము తెలుసుకునేలా చేయండి.
సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ, వాటిని పిల్లలకు తెలియజెబుతూ ఉండండి.
⇒ ‘మేగజైన్లలో వచ్చే పజిల్స్‌ను నింపడం ద్వారా కొత్త సంగతులు తెలుసుకోవచ్చునని, అలాగే మనకు ఎంత వరకు తెలుసు అన్నది నిర్ధారణ చేసుకోవచ్చునని మీ పిల్లలకు చెప్పండి. మీరు వాటిని పూరిస్తూ, అందులో మీ పిల్లలను కూడా భాగస్వాములను చేయండి.
⇒ చదువుతోబాటు పరిశోధనల సమాచారాన్ని తెలుసుకోవడంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పిల్లలకు తెలియజెప్పండి.
⇒ మన రక్షణ రంగంలో వాడుతున్న క్షిపణుల పేర్లు తదితర వివరాలు మీరు తెలుసుకుని మీ పిల్లలకు కూడా తెలియజెప్పండి.
కోటలు, ప్యాలెస్‌ల వంటి చోటుకు పర్యటనకు వెళ్లినప్పుడు వాటి నిర్మాణంలో నాటి శిల్పులు అనుసరించిన నైపుణ్యాన్ని కూడా పరిశీలించడాన్ని పిల్లలకు అలవరచండి.
⇒ సినిమాకు తీసుకు వెళ్లినప్పుడు సినిమా కథతోపాటు అందులో గ్రాఫిక్స్, డిటిఎస్... లాంటి వాటిని కూడా వారు ఆనందించేలా చూడండి.