ఆన్‌లైన్‌లో స్విమ్ సూట్‌ను కొనుగోలు చే యాలంటే...

ఆన్‌లైన్‌లో స్విమ్ సూట్‌ను కొనుగోలు చే యాలంటే... - Sakshi


షాపింగ్

 

ఇటీవల షాపులకు వెళ్లి, కొంత టైమ్ కేటాయించి నచ్చిన వాటిని ఎంచుకునే సమయం అందరికీ ఉండటం లేదు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో స్విమ్ సూట్ కొనుగోలు చేయాలంటే...

 

రూల్ వన్: మీ శరీర సౌష్టవం ఏ తరహాలో ఉంటుందో చెక్ చేసుకోవాలి. ఛాతి పరిమాణం ఎక్కువ ఉన్నవారు అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఉన్న బికినీ ఎంచుకుంటే మేలు. పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఆ భాగాని కవర్ చేసే చిన్న ప్రింట్లు ఉన్న స్విమ్ సూట్ ఎంపిక సరైనది. ప్రముఖ స్విమ్‌వేర్ కంపెనీలు ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా కొనుగోలుదారుల సందేహాలను తీరుస్తున్నాయి. వాటిని ఫాలో అవడం మంచిది.

 

రూల్ టు: మీకు నచ్చిన సూట్స్ కనీసం 2 కొలతలలో ఆర్డర్ ఇవ్వాలి. సైజ్ చార్ట్‌లో సూచించిన సైజ్, ఆ తర్వాతి సైజ్ సూట్‌ను ఆర్డర్ చేసుకోవడం మేలు. రూల్ త్రీ: కొన్ని రకాల డిజైన్లు, ప్రింట్లు ఆన్‌లైన్‌లో చూడగానే నచ్చుతాయి. కాని ధరిస్తే అవి అంతగా నప్పవు. రంగులు, డిజైన్లు గల మరో క్లాత్‌తో మీకు ఆ తరహా ప్రింట్లు నచ్చుతాయో లేదో చెక్ చేసుకొని, ఆర్డర్ ఇవ్వడం మేలు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top