జీపీఎస్ పనిచేసేదిలా... | Works with GPS ... | Sakshi
Sakshi News home page

జీపీఎస్ పనిచేసేదిలా...

Feb 23 2016 10:14 PM | Updated on Nov 6 2018 5:26 PM

జీపీఎస్ పనిచేసేదిలా... - Sakshi

జీపీఎస్ పనిచేసేదిలా...

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందా? దాంట్లో ఉన్న ఒక్క అప్లికేషన్ ఆన్ చేయగానే...

హౌ ఇట్ వర్క్స్

చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందా? దాంట్లో ఉన్న ఒక్క అప్లికేషన్ ఆన్ చేయగానే... మీరెక్కడున్నారన్న సంగతి, మీ చుట్టుపక్కల ఉన్న విశేషాలూ అన్నీ సందేశాల రూపంలో వచ్చేస్తాయి. ఆ అప్లికేషన్‌ను జీపీఎస్ అంటారని తెలుసుగానీ... అదెలా పనిచేస్తుందో తెలిసింది మాత్రం చాలా తక్కువ మందికి.  దీంట్లో ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్దాంతముంది, క్వాంటమ్ మెకానిక్స్ ఉంది. వేల కిలోమీటర్ల ఎత్తులో ఎగిరే ఉపగ్రహాలున్నాయి... ఇంకెందుకు ఆలస్యం చదివేయండి మరి...

{పస్తుతం మనం ఉపయోగిస్తున్న జీపీఎస్ వ్యవస్థలో 30 ఉపగ్రహాలు ఉన్నాయి. అణుశక్తితో పనిచేసే గడియారాలున్న ఈ ఉపగ్రహాలు నిత్యం కాంతివేగంతో రేడియో తరంగాలను ప్రసారం చేస్తూంటాయి. మన స్మార్ట్‌ఫోన్లలోని జీపీఎస్ రిసీవర్లు ఈ రేడియో తరంగాలు ఫోన్‌ను చేరిన సమయాన్ని నమోదు చేస్తాయి. దీని ఆధారంగా, అణుశక్తి గడియారాల్లో ఉపయోగించే సీసీయం, రుబీడియం వంటి అణువుల్లోని ఎలక్ట్రాన్ల శక్తి మార్పుల ఆధారంగా స్మార్ట్‌ఫోన్‌కు, ఉపగ్రహానికి మధ్య ఉన్న దూరాన్ని లెక్కవేస్తాయి. ఈ శక్తిమార్పు సెకనుకు 900 కోట్ల సార్లు జరుగుతూంటుంది. దీనివల్ల సెకనులో వందకోట్లవ వంతు కచ్చితత్వంతో టైమ్‌ను గుర్తించవచ్చు.
     
జీపీఎస్ వ్యవస్థలోని ఉపగ్రహల్లో ఏ క్షణంలోనైనా కనీసం నాలుగు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ నాలుగింటి ద్వారా వచ్చే తరంగాలను నమోదు చేసి దూరాలను లెక్కిస్తారు. ఉపగ్రహాలు సమాచారం ప్రసారం చేసే పరిధి తెలుసు కాబట్టి నాలుగింటి పరిధుల ఆధారంగా మీరు ఎక్కడున్నారో గుర్తిస్తారు. దీనికోసం ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఉపయోగపడుతుంది.

 
 

Advertisement
 
Advertisement
Advertisement