ఇన్‌స్టంట్ నూడుల్స్‌తో ఆరోగ్యానికి చేటు.. | With instant noodles health disaster | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టంట్ నూడుల్స్‌తో ఆరోగ్యానికి చేటు..

May 15 2015 11:02 PM | Updated on Sep 3 2017 2:06 AM

ఇన్‌స్టంట్ నూడుల్స్‌తో  ఆరోగ్యానికి చేటు..

ఇన్‌స్టంట్ నూడుల్స్‌తో ఆరోగ్యానికి చేటు..

‘ఇన్‌స్టంట్ నూడుల్స్’ అంటూ హోరెత్తించే ప్రకటనల ప్రభావంతో త్వరగా తయారు చేసుకోగల నూడుల్స్‌నే మీ బ్రేక్‌ఫాస్ట్‌గా

‘ఇన్‌స్టంట్ నూడుల్స్’ అంటూ హోరెత్తించే ప్రకటనల ప్రభావంతో త్వరగా తయారు చేసుకోగల నూడుల్స్‌నే మీ బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకుంటున్నారా..? అయితే, మీరు చాలా ఆరోగ్య సమస్యలను ‘కొని’ తెచ్చుకుంటున్నట్లే! దక్షిణ కొరియాలో జరిపిన ఒక పరిశోధనలో నూడుల్స్ వల్ల తలెత్తే అనర్థాలు వెలుగులోకి వచ్చాయి.

నూడుల్స్ తింటే శరీరంలోని రక్తపోటు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వంటి దుష్ఫలితాలు కలుగుతాయని, చివరకు గుండెజబ్బులకు, పక్షవాతానికి గురయ్యే ముప్పు కూడా పెరుగుతుందని ఆ పరిశోధనలో తేలింది. నూడుల్స్‌లోని అధిక మోతాదులో ఉండే సోడియం, అన్‌శాచ్యురేటెడ్ కొవ్వుల వల్ల ఈ దుష్ర్పభావాలు కలుగుతాయని దక్షిణ కొరియా శాస్త్రవేత్త హ్యున్ షిన్ వివరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement