చలి మంచిదే... | Winter season special... | Sakshi
Sakshi News home page

చలి మంచిదే...

Jan 19 2016 12:02 AM | Updated on Sep 3 2017 3:51 PM

చలి మంచిదే...

చలి మంచిదే...

శీతకాలంలో తీవ్రమైన చలి మనుషులను వణికించేస్తుంది గానీ, అది మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పరిపరిశోధన
శీతకాలంలో తీవ్రమైన చలి మనుషులను వణికించేస్తుంది గానీ, అది మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయే వేళలో చాలామంది ముసుగుతన్ని పడుకోవాలనుకుంటారు. అలా కాకుండా, అంత చలిలోనూ బయట కాసేపు నడిచినా, కొద్దిపాటి వ్యాయామం చేసినా దాని ఫలితం మామూలు సమయంలో చేసిన వ్యాయామం కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. వాతావరణంలో చలి ఎక్కువగా ఉండేటప్పుడు శరీరంలోని శక్తి త్వరగా ఖర్చవుతుందని, ఫలితంగా ఒంట్లో కొవ్వు కరిగి శరీరం తేలికపడుతుందని అంటున్నారు.

సమశీతల వాతావరణంలో కంటే చలి వాతావరణంలో ఉన్నప్పుడు ఒంట్లోని కొవ్వు వేగంగా కరుగుతుందని తమ అధ్యయనంలో తేలినట్లు కెనడాలోని షెర్‌బ్రూక్ వర్సిటీకి చెందిన ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఆండ్రూ కార్పెంటర్ చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement