breaking news
Temperate climate
-
తెలంగాణ: నిప్పుల కొలిమిలా ఆ జిల్లాలు.. జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో.. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మంచిర్యాల(ఉమ్మడి ఆదిలాబాద్), నిజామాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ (ఉమ్మడి ఆదిలాబాద్), నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీ సెంటిగ్రెడ్ పైగా ఉష్ణోగ్ర తలు నమోదు అయ్యాయి. ఆయా జిల్లాల్లో నమోదు అయిన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. మంచిర్యాల కొండాపూర్ లో 45.8 డిగ్రీ సెంటిగ్రేడ్ జన్నారంలో 45.8 డిగ్రీ సెంటిగ్రేడ్ బెల్లంపల్లిలో 45.4 డిగ్రీ సెంటిగ్రేడ్ నీల్వాయి 45.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కొమ్మెర 44.9 డిగ్రీ సెంటిగ్రేడ్ జగిత్యాల జైనా లో 45.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 45.4 డిగ్రీ సెంటిగ్రేడ్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ 45.1 డిగ్రీ సెంటిగ్రేడ్, నల్లగొండ జిల్లా పజ్జూరులో 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల పాటు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. అయితే.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 38 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 41 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. -
చలి మంచిదే...
పరిపరిశోధన శీతకాలంలో తీవ్రమైన చలి మనుషులను వణికించేస్తుంది గానీ, అది మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయే వేళలో చాలామంది ముసుగుతన్ని పడుకోవాలనుకుంటారు. అలా కాకుండా, అంత చలిలోనూ బయట కాసేపు నడిచినా, కొద్దిపాటి వ్యాయామం చేసినా దాని ఫలితం మామూలు సమయంలో చేసిన వ్యాయామం కంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. వాతావరణంలో చలి ఎక్కువగా ఉండేటప్పుడు శరీరంలోని శక్తి త్వరగా ఖర్చవుతుందని, ఫలితంగా ఒంట్లో కొవ్వు కరిగి శరీరం తేలికపడుతుందని అంటున్నారు. సమశీతల వాతావరణంలో కంటే చలి వాతావరణంలో ఉన్నప్పుడు ఒంట్లోని కొవ్వు వేగంగా కరుగుతుందని తమ అధ్యయనంలో తేలినట్లు కెనడాలోని షెర్బ్రూక్ వర్సిటీకి చెందిన ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఆండ్రూ కార్పెంటర్ చెబుతున్నారు.