వీసాల్జియా... | Visaljiya ... | Sakshi
Sakshi News home page

వీసాల్జియా...

Nov 23 2015 10:55 PM | Updated on Sep 3 2017 12:54 PM

వీసాల్జియా...

వీసాల్జియా...

నాస్టాల్జియాలా వినిపిస్తోంది కదూ! మందెక్కువైన స్థితిలో చాలామంది నాస్టాల్జియాలోకే వెళతారు.

మెడిక్షనరీ

నాస్టాల్జియాలా వినిపిస్తోంది కదూ! మందెక్కువైన స్థితిలో చాలామంది నాస్టాల్జియాలోకే వెళతారు. కిక్కు తలకెక్కిన దశలో గతాన్నంతా తవ్వి తలకెత్తుకుంటారు. మర్నాడు నిద్రలేవడంతోనే తలదిమ్ముగా, కళ్లు మంటలుగా, కడుపులో వికారంగా ఉంటుంది. పక్క మీద నుంచి లేవడమే కష్టంగా ఉంటుంది. ఎలాగోలా కాలకృత్యాదికాలు కానిచ్చుకుని, రొటీన్‌లో పడ్డా... రోజంతా నిస్సత్తువగా, ఒళ్లంతా భారంగా అనిపిస్తుంది. డోసెక్కువైతే ఇలాగే ఉంటుంది మరి.

దీన్నే మామూలు భాషలో హ్యాంగోవర్ అంటారని తెలిసిందే. దీనినే వైద్య పరిభాషలో ‘వీస్టాల్జియా’ అంటారు. నార్వేజియన్ పదం ‘వీస్టా’ అంటే తప్పతాగడం వల్ల తలెత్తే ఇబ్బంది అని అర్థం. గ్రీకు భాషలో ‘ఆల్జియా’ అంటే నొప్పి అని అర్థం. ఈ రెండు పదాలను మిక్స్ చేసి ఈ పదాన్ని కనిపెట్టారు వైద్యులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement