ష్‌... ఎవరికీ చెప్పకు తమ్మూ!! | Vikram & Tamannah's Sketch | Sakshi
Sakshi News home page

ష్‌... ఎవరికీ చెప్పకు తమ్మూ!!

May 21 2017 3:25 AM | Updated on Sep 5 2017 11:36 AM

ష్‌... ఎవరికీ చెప్పకు తమ్మూ!!

ష్‌... ఎవరికీ చెప్పకు తమ్మూ!!

ఎవరు స్కెచ్‌ వేశారు? హూ ఈజ్‌ దిస్‌? అని తమన్నా అడుగుతుంటే ‘ష్‌... ఎవరికీ చెప్పకు తమ్మూ’ అన్నట్టు ముక్కు మీద వేలేసుకుని చిన్న పిల్లాడిలా ‘చియాన్‌’ విక్రమ్‌ ఎలా ఫేస్‌ పెట్టాడో చూడండి.

ఎవరు స్కెచ్‌ వేశారు? హూ ఈజ్‌ దిస్‌? అని తమన్నా అడుగుతుంటే ‘ష్‌... ఎవరికీ చెప్పకు తమ్మూ’ అన్నట్టు ముక్కు మీద వేలేసుకుని చిన్న పిల్లాడిలా ‘చియాన్‌’ విక్రమ్‌ ఎలా ఫేస్‌ పెట్టాడో చూడండి. అక్కడితో ఆగలేదు. షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న జనాలందర్నీ తమన్నా దగ్గరకు తీసుకొచ్చి... ‘ఇతను కావొచ్చు, ఇతను కావొచ్చు, వీళ్లలో ఎవరైనా కావొచ్చు’ అంటూ హడావుడి చేశారు.

మేటర్‌ ఏంటంటే? విక్రమ్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘స్కెచ్‌’. టైటిల్‌ డిఫరెంట్‌గా ఉంది కదూ! సినిమా కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుందట. ‘స్కెచ్‌’ చుట్టూ కథ తిరుగుతుంది. మరి, ఆ స్కెచ్‌ ఎవరు? మనిషా? మరొకటి ఏదైనానా? తమన్నా ఎక్కడ చెప్పేస్తుందోనని విక్రమ్‌లో చిన్నపాటి భయం. బయటకు ఏం రివీల్‌ చెయ్యొద్దని ఇన్‌డైరెక్ట్‌గా ఇలా చెప్పారన్న మాట! ఎందు కంటే... తమన్నా నిన్నటితో తన టాకీ పార్ట్‌ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసేశారు.

Advertisement
 
Advertisement
Advertisement