తారోద్వేగం | Tollywood Celebrities React On The Encounter Of All Four Accused In Hyderabad | Sakshi
Sakshi News home page

తారోద్వేగం

Dec 7 2019 2:56 AM | Updated on Dec 7 2019 8:41 AM

Tollywood Celebrities React On The Encounter Of All Four Accused In Hyderabad  - Sakshi

కొన్ని రోజుల క్రితం దిశకు జరిగిన అన్యాయం చూసి మన తారలు ఆగ్రహానికి గురయ్యారు. తమ భావావేశాన్ని ట్వీటర్‌లో ట్వీట్స్‌ ద్వారా తెలిపారు. నిందితులపై శుక్రవారం జరిగిన ‘ఎన్‌కౌంటర్‌’ చూసి న్యాయం జరిగినట్టు హర్షించారు. వారి స్పందన ఇలా ఉంది.

దిశ సంఘటనలో నిందితులు పోలీసుల కాల్పుల్లో మతి చెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం, సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే.

– చిరంజీవి


ఈ వార్తతోనే నిద్రలేచాను. న్యాయం జరిగింది.

– నాగార్జున


ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈ రోజు నిందితులకు సరైన శిక్ష విధించడం జరిగింది. మరోసారి ఎవ్వరూ కూడా ఇంటి దారుణాలకు పాల్పడకుండా, ఇలాంటి ఆలోచన మొలకెత్తనీయకుండా వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం జరిగింది. అందరికీ కూడా ఇదొక గుణపాఠం కావాలి.

– బాలకృష్ణ


దిశకు న్యాయం చేయడం ఇక్కడితో పూర్తి కాలేదు. ఇక్కడితో మొదలవ్వాలి. చిన్నప్పటినుంచే విద్య, సాధికారత, జ్ఞానం అందించడం వల్లే ఇది సాధ్యం అవుతుంది. జైహింద్‌.

– రవితేజ


న్యాయం చేకూరింది. దిశ ఆత్మకు శాంతి లభిస్తుంది.

– ఎన్టీఆర్‌


మేం ఏం చేసినా నిన్ను తిరిగి తీసుకురాలేం. కానీ ఇవాళ జరిగింది నీకు, నీ కుటుంబానికి శాంతిని తీసుకొస్తుందని భావిస్తున్నాం.

– రామ్‌చరణ్‌


న్యాయం చేకూరింది.

– అల్లు అర్జున్‌


‘ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడు అయ్యుండాలి’

– నాని


ఆ బుల్లెట్‌ దాచుకోవాలనుంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలనుంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజునే నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా

– మంచు మనోజ్‌


న్యాయం చేకూరింది. హైదరాబాద్‌ పోలీసులకు హ్యాట్సాఫ్‌.

– గోపీచంద్‌


నువ్వు బ్యాడ్‌ అయితే.. సిచ్యుయేషన్స్‌ కూడా వెరీ బ్యాడ్‌. హైదరాబాద్‌ పోలీసులు నిజమైన హీరోలు.

– రామ్‌


ఇలాంటి దారుణాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చిన వారికి ఇదో హెచ్చరికలా ఉంటుంది అనుకుంటున్నాను. దిశ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

– నితిన్‌


చెల్లెమ్మా, నిన్ను కాపాడుకోలేకపోయాం. కానీ న్యాయం జరిగేలా చూశాం.

– సాయిధరమ్‌ తేజ్‌


మన పని అప్పుడే పూర్తవ్వలేదు. మన చెల్లెళ్లందరికీ సురక్షితమైన సమాజాన్ని అందించడం మనందరి బాధ్యత.

– కార్తికేయ


తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి చేతులెత్తి మొక్కుతున్నాను. యూ ఆర్‌ ది రియల్‌ హీరోస్‌. నేను ఒక్క విషయం నమ్ముతాను.. మనకు కష్టం వచ్చినా, కన్నీళ్లు వచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే.

–  పూరి జగన్నాథ్‌


పొల్యూషన్‌ నుంచి తప్పించుకోవచ్చు కానీ పోలీస్‌ నుంచి తప్పించుకోలేరు.

– బోయపాటి శ్రీను


ఐ లవ్‌ తెలంగాణ. భయమే నిజమైన పరిష్కారం. కొన్నిసార్లు అదొక్కటే పరిష్కారం.

– సమంత


హైదరాబాద్‌ పోలీసులకు పెద్ద సెల్యూట్‌.

– రాశీ ఖన్నా


ఇలాంటి పాపం చేసి ఎంతదూరం పరిగెడదాం అనుకున్నారు? థ్యాంక్యూ తెలంగాణ పోలీస్‌.

– రకుల్‌ప్రీత్‌ సింగ్‌


నీ ఆత్మ శాంతించి ఉంటుందని అనుకుంటున్నాను.

–  రష్మికా మందన్నా

తెలంగాణ పోలీసులు శభాష్‌.. వారికి శుభాకాంక్షలు

– రిషికపూర్‌

తెలంగాణ సీఎమ్‌ఓ, సైబరాబాద్‌ పోలీస్, వీసీ సజ్జనార్‌ స్వీట్‌ అండ్‌ స్ట్రాంగ్‌గా నిజమైన న్యాయం చేశారు. వ్యవస్థ వెనకాల దాక్కొని ఉన్న ఇలాంటి రాక్షసులకు ఇది ఓ సందేశం. ఇలాంటి రాక్షసులు అందరూ ఇప్పుడు భయంతో వణికిపోతుంటారు

– వివేక్‌ ఒబెరాయ్‌


తెలంగాణ పోలీసులకు జయహో

– అనుపమ్‌ ఖేర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement