బెల్లీ ఫ్యాట్‌కు ఇలా చెక్‌ పెట్టండి..

These 10 Spices Reduces Your Belly Fat  Without Exercising - Sakshi

అమ్మాయిలను ఎక్కువగా బాధించే విషయం బరువు, బెల్లీ ఫ్యాట్ ‌(పొట్ట చూట్టు కొవ్వు పేరుకుపోవడం). దీంతో అధిక బరువుతో పాటు పొట్టను తగ్గించుకోవడానికి అమ్మాయిలు జిమ్‌లో గంటలు గంటలు కుస్తీ పడుతుంటారు. అయినప్పటికీ మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల పొట్ట చూట్టూ మళ్లీ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు కసరత్తులు చేయడం లేదా స్ట్రిక్ట్‌ డైట్‌తో నోరు కట్టేసుకుంటుంటారు అమ్మాయిలు.

అయితే అలా చేయడం కూడా ఆరోగ్యానికి హానికరమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ, శరీరంలోని సమతుల్యతతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చిరిస్తున్నారు. అందుకని వర్కవుట్స్ చేయకుండానే మనకు వంటింట్లో అందుబాటులో ఉన్న సుగంధ ద్రవ్యాలతో మీ బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.‌ ఇవి కొవ్వును తగ్గించమే కాకుండా జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు శరీరంలో ఇన్సులిన్‌ను సమతుల్యం చేసి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పొట్ట చూట్టూ పేరుకున్న చెడు కొవ్వును కరిగిస్తాయి. ఇక అవేంటో చుద్దాం రండి . (పదే పదే శానిటైజర్‌ వాడుతున్నారా?)

మిరియాలు: ఇది శరీరంలో థర్మోజెనిక్ ప్రభావాలను పెంచుతుందని పరిశోధనలో తెలినట్లు  ప్రముఖ పోషకాహార నిపుణులు సుమయ డాల్మియా తెలిపాడు. అంటే ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడంతో పాటు కొవ్వును కూడా కరిగించడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేగాక జీవక్రియ రేటును కూడా వేగవంతం చేస్తుంది. మీ ఆహారంలో మిరియాలతో పాటు నిమ్మకాయను కూడా చేర్చండి. ఎందుకంటే నిమ్మకాయలోని సిట్రస్‌ మీ సిస్టమ్‌ను ఆల్కలీన్‌గా చేస్తుంది. శరీరంపై కారపు థర్మోజెనిక్ ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. 

సోంపు గింజలు: ఇవి జీర్ణక్రియకు సహాయపడతంతో పాటు ఉబ్బుసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

దాల్చిన చెక్క: ఇది మీ ఇన్సులిన్, చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల పేరుకుపోయిన కొవ్వును విచ్చిన్నం చేస్తుంది.  

ఇంగువ: ఇది శరీరంలో అపానవాయువును తగ్గిస్తుంది. అపానవాయువును సృష్టించే ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని తరచూ మీ ఆహారపు అలవాట్లలో దీనిని చేర్చుకోండని నిపుణులు సూచిస్తున్నారు. .

ఆవ పిండి(గింజలు): ఇవి మీ ఆహారానికి సుగంధాన్ని ఇవ్వడమే కాకుండా కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. 

మెంతులు: ఇది ఆకలిని నియంత్రిస్తుంది. జంక్‌ ఫుండ్‌ తినాలన్న మీ ఆహార కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఖ​చ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో మెంతులను జోడించండి. 

పసుపు: ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో సహయపడుతుంది. కొవ్వును కరిగించడంలో సహయపడే హార్మోన్‌ లెప్టిన్‌ను మరింత విడుదల చేయడానికి జీవక్రియ ప్రక్రియలో అనుమతిస్తుంది.  

యాలకులు: ఇది ఉబ్బరం, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసే మెలటోనిన్ను కూడా ప్రాసెస్ చేస్తుంది. యాలకులు శరీరంలో పేరుకుపోయిన చెడును కొవ్వును మూత్రవిసర్జన ద్వారా బయటకు పంపిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top