సాంకేతిక పురోగతిని దుర్వినియోగం చేస్తున్నాం!

సాంకేతిక పురోగతిని దుర్వినియోగం చేస్తున్నాం! - Sakshi


గ్రంథపు చెక్క

 

మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే విధానాలు రూపొందించేందుకు సైన్స్ ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మానవజీవితాన్ని సంక్లిష్టం చేస్తుంది కూడా.

 

ఆవిరియంత్రం, రైల్వే, విద్యుచ్ఛక్తి, కాంతి, టెలిగ్రాఫ్, రేడియో, ఆటోమొబైల్, విమానాలు, డైనమోలు మొదలైన పరిశోధనలు సైన్స్‌ఫలితాలే. ఈ పరిశోధనల ప్రయోజనం... అది మానవుని దుర్భర శారీరక కష్టాల నుండి దూరం చేస్తుంది. మనిషి జీవనానికి శారీరక కష్టం ఒకనాడు అనివార్యంగా ఉండేది.

 

మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం లేదా అనువర్తిత శాస్త్ర విజ్ఞానం (అప్లయ్డ్ సైన్స్) అనేక సమస్యలను సృష్టిస్తుంది. మానవుని ఉనికి ఈ సమస్యల పరిష్కారంపై ఆధారపడి ఉంటుంది. సాంకేతిక పురోభివృద్ధి దూరాన్ని తగ్గించింది. నూతన విధ్వంసక సాధనాలను అది సృష్టించింది. ఇది మానవజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. అసలు మానవ ఉనికే ఇందువల్ల ప్రమాదంలో పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మొత్తం భూగ్రహానికి న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు గల ఒకే శక్తి ఉండడం అవసరం.

 

సాంకేతిక పురోగతిని మన ఉనికిని చాటుకునేందుకు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నామో ఆధునిక నిరంకుశత్వం, దాని విధ్వంసకశక్తికి నిదర్శనంగా మారింది. ఇక్కడ కూడా ఆయా పరిస్థితులను బట్టి అంతర్జాతీయ పరిష్కారం సాధించాల్సి ఉంటుంది. ఇందుకు కావల్సిన మానసిక ప్రాతిపదికను ఇప్పటికీ ఏర్పాటు చెయ్యలేదు.

 

ఆదిమ మానవుడు ప్రకృతి చట్టాలను పాక్షికంగా అర్థం చేసుకోవడం దెయ్యాలు, ఆత్మల పట్ల కూడా నమ్మకాన్ని సృష్టించింది. మానవ మేధస్సు ఆధారంగా అభివృద్ధి చెందుతూ సైన్స్ మానవుని అభద్రతాభావాన్ని అధిగమించింది..

 

- ‘ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సామాజిక రాజకీయ రచనలు’

 పుస్తకం నుంచి.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top