బీరు, వైన్‌లతో ఆ రిస్క్‌..

Study Found Drinkers Show More Signs Of their vital organ is Shrinking - Sakshi

లండన్‌ : మద్యం అతిగా సేవించే వారి మాటతడబడటం, చూపు మసకబారడం చూస్తుంటాం. అయితే ఆల్కహాల్‌ మెదడు వయసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది నిర్ధిష్టంగా వెల్లడికాని క్రమంలో తాజా అథ్యయనం సరికొత్త అంశాలను ముందుకు తెచ్చింది. మద్యం తీసుకునే మోతాదును బట్టి మెదడు వయసు పెరుగుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. నిత్యం మద్యం సేవించే 45 నుంచి 81 సంవత్సరాల మధ్య వయసున్న 11,600 మందిపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెలుగుచూశాయి. రోజూ ఒక బీరు లేదా గ్లాస్‌ వైన్‌ను మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాముతో వారి మెదడు క్రమంగా కుచించుకుపోతున్నట్టు ఈ అథ్యయనం నిగ్గుతేల్చింది.

రోజులో అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ఆల్కహాల్‌తో వారి మెదడు రోజున్నరతో సమానమైన 0.02 సంవత్సరాల వయసు మీరుతుందని పరిశోధకులు గుర్తించారు. మద్యపానం, పొగతాగడం మెదడు వయసుమీరడానికి  దారితీస్తుందనేది తొలిసారిగా కెక్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఆఫ్‌ సదరన్‌ కాలిపోర్నియా పరిశోధకులు నిర్ధారించారు. రోజూ మద్యం సేవించే వారి మెదడు మద్యం తక్కువగా లేదా అసలు ముట్టని వారి మెదడు వయసుల మధ్య వ్యత్యాసాన్ని ఎంఆర్‌ఐ ద్వారా పరిశోధకులు పరిశీలించారు. ఒక గ్లాస్‌ వైన్‌, పింట్‌ బీరుకు మించి అదనంగా తీసుకునే ప్రతి గ్రాము ద్వారా మద్యపాన ప్రియుల మెదడు 0.02 సంవత్సరాలు వయసు మీరుతున్నట్టు వారు లెక్కగట్టారు. పొగతాగేవారిలోనూ ఇదే ఫలితాలు కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు.

చదవండి : చుక్కేశారు.. చిక్కేశారు...ఎక్కేశారు...

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top