పిల్లలూ మీ కలలను బొమ్మలగా గీయండి
మీలో ఎన్నో ఆలోచనలు కొత్తవి, ఎన్నెన్నో అభిప్రాయాలు రేపటివి, మీ చిన్ని మనసుల్లో చిగురించే ఊహలే గొప్ప గొప్ప ప్రయోగాలకి, పరిశోధనలకి మూలమైనట్లు తెలుసా మీకు? మీలో కదలాడే కలలు, మొలకెత్తే భావాలూ లోలోపలే ఉండిపోతే, వాటి బరువు మోయలేనంత కష్టం కదా. అందుకే ఆ బరువు కాగితం పైకి దించేయండి,
డియర్ స్టూడెంట్స్,
బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
మీలో ఎన్నో ఆలోచనలు కొత్తవి, ఎన్నెన్నో అభిప్రాయాలు రేపటివి, మీ చిన్ని మనసుల్లో చిగురించే ఊహలే గొప్ప గొప్ప ప్రయోగాలకి, పరిశోధనలకి మూలమైనట్లు తెలుసా మీకు? మీలో కదలాడే కలలు, మొలకెత్తే భావాలూ లోలోపలే ఉండిపోతే, వాటి బరువు మోయలేనంత కష్టం కదా. అందుకే ఆ బరువు కాగితం పైకి దించేయండి, మీ ఆలోచనల్ని పెయింటింగ్స్ గాబైటపెట్టండి. మీ ఆశయాలకి రంగులద్దండి. క్రియేటివిటీ మీకు అమ్మ గోరుముద్దలతో పెట్టిన విద్య అని నిరూపించండి.
గీతలే కాదు, మీ రాతలు కూడా పంపవచ్చు. అందుకు
sakshi.com మీకు చక్కని వేదిక కల్పిస్తోంది. టాపిక్ నిబంధనలు లేవు. మీరు పదవ తరగతిలోపు ఏ స్కూల్ స్టూడెంట్ అయినా కావొచ్చు, మీ పేరు, ఫొటో, తరగతి, స్కూల్ పేరు, చిరునామా వంటి వివరాలతో మీరు గీసిన బొమ్మల్ని, లేదా మీ తెలుగు వ్యాసాన్ని sakshidaily@gmail.com కి ఇ-మెయిల్ చేయండి(పేజీలను స్కానింగ్ చేసి కూడా పంపవచ్చు). వాటిలో మేలైన వ్యాసాలు, మంచి పెయింటింగ్స్
sakshi.comలో ప్రచురిస్తాం. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే మొదలెట్టండి. ఇ-మెయిల్ చేయండి.