ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ | State-level workshop tomorrow horticulture department home crops | Sakshi
Sakshi News home page

ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌

Oct 23 2018 5:14 AM | Updated on Oct 23 2018 5:14 AM

State-level workshop tomorrow horticulture department home crops - Sakshi

నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు (అర్బన్‌ ఫార్మింగ్‌)పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ నెల 24న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు జీడిమెట్ల విలేజ్‌(పైపులరోడ్డు)లోని సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. అర్బన్‌ ఫార్మింగ్, వర్టికల్‌ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్‌ తదితర అంశాలపై కేరళకు చెందిన నిపుణురాలు డాక్టర్‌ సుశీల శిక్షణ ఇస్తారు. 25 మంది సీనియర్‌ ఇంటిపంటల సాగుదారులు తమ అనుభవాలను వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మోహన్‌ కందా పాల్గొంటారని ఉద్యాన కమిషనర్‌ ఎల్‌. వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగలవారు 79977 24936, 79977 24983, 79977 24985 నంబర్లకు ఫోన్‌ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement