బీకాం ఫస్టియర్‌ సెలబ్రిటీ | social media Celebrity | Sakshi
Sakshi News home page

బీకాం ఫస్టియర్‌ సెలబ్రిటీ

Feb 13 2018 12:40 AM | Updated on Oct 22 2018 6:05 PM

social media Celebrity - Sakshi

మీరు ఈ అమ్మాయిని గత ఇరవై నాలుగ్గంటల్లో ఎక్కడో చూసే ఉంటారు. లేదా రాగల ఇరవై నాలుగ్గంటల్లో కచ్చితంగా మీరు ఈ అమ్మాయి కంట్లో పడతారు. అప్పుడు తను మీకు కొంటెగా కన్నుగీటుతుంది. ఆ గీటడం మీకొక వాలెంటైన్‌ గిఫ్టులా అనిపించినా ఆశ్చర్యంలేదు. ఆమె నవ్వు కూడా మిమ్మల్ని సమ్మోహనపరుస్తుంది. ‘మరుపా.. మైమరుపా..’ అనే మణిరత్నం సినిమాలోని పాట మీ పెదవులపై మీకు తెలియకుండానే ‘హమ్‌’ అవుతుంది.

ఇంతకీ ఎక్కడ కనిపిస్తుంది తను? విశ్వమంతా. అవును సోషల్‌ మీడియా అకౌంట్‌లలోకి ఒకర్నుంచి ఒకరికి ఈ ‘కన్నుకొడుతున్న అమ్మాయి’ ఇప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తోంది. త్వరలో రాబోతోన్న మలయాళీ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’ లోని ‘మాణిక్య మలరయ పూవీ’ పాటలో కనిపించే టీనేజ్‌ నటి ప్రియా వారియరే ఈ అమ్మాయి. స్కూల్‌ రొమాన్స్‌ సీన్‌లోని ఆ పాటలో ఆమె కన్ను కొడుతుంది. ఆ ముక్కను కట్‌ చేసి ఎవరో ‘సోషల్‌ తెర’కు ఎక్కించారు! ప్రియ కేరళ అమ్మాయి. త్రిస్సూర్‌లోని విమల కాలేజీలో బీకాం ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ చిన్న క్లిప్పుతో సెలబ్రిటీ అయిపోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement