ఇరవై నిమిషాలకోసారి చిన్న ఎక్సర్‌సైజ్‌...

Smaller exercise for twenty minutes  - Sakshi

గుండెజబ్బులతో బాధపడే వారు ఇరవై నిమిషాలకోసారి అటు ఇటు తిరగడంగానీ తేలికపాటి వ్యాయామం చేయడం గానీ మంచిదని, తద్వారా ఆయుష్షును పెంచుకునే అవకాశముందని అంటున్నారు శాస్త్రవేత్తలు. కెనడాలో జరుగుతున్న ఓ అంతర్జాతీయ సదస్సులో డాక్టర్‌ ఐలర్‌ రమడీ ఒక పరిశోధన వ్యాసం సమర్పిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. గుండెజబ్బుతో ఉన్న వారు రోజులో ఎక్కువభాగం ఏ వ్యాయామం చేయకుండా ఉంటున్నారని, ఇది వారి ఆయుష్షుపై దుష్ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.

రోజుకు కనీసం 770 కిలో కేలరీల శక్తిని ఖర్చు చేసేంత వ్యాయామం చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చునని అన్నారు. అయితే రోజులో ఎంత కాలావధితో ఇలా చేయాలన్న అంశంపై తాము ఒక అధ్యయనం చేశామని.. 20 నిమిషాలకోసారి కనీసం ఏడు నిమిషాలపాటు తేలికపాటి వ్యాయామం చేయడం మేలని ఇందులో తేలిందని వివరించారు. వ్యాయామం చేయాలన్నంత మాత్రాన విపరీతమైన శారీరక శ్రమ అవసరం లేదని.. కూర్చుని నుంచోవడం మొదలుకొని మామూలు వేగంతో కొన్ని అడ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top