షార్ట్‌ఫిల్మ్ ఫైల్‌ను షేర్‌లో ఉంచడం మరవొద్దు! | Short Film at the position in the file share don't forget | Sakshi
Sakshi News home page

షార్ట్‌ఫిల్మ్ ఫైల్‌ను షేర్‌లో ఉంచడం మరవొద్దు!

Feb 12 2015 10:49 PM | Updated on Mar 22 2019 1:53 PM

షార్ట్‌ఫిల్మ్ ఫైల్‌ను షేర్‌లో ఉంచడం మరవొద్దు! - Sakshi

షార్ట్‌ఫిల్మ్ ఫైల్‌ను షేర్‌లో ఉంచడం మరవొద్దు!

‘పూరి జగన్నాథ్ డెరైక్టర్ హంట్’కు ఔత్సాహికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

‘పూరి జగన్నాథ్ డెరైక్టర్ హంట్’కు ఔత్సాహికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. పూరి ఇచ్చిన కాన్సెప్టులతో తాము రూపొందించిన షార్ట్‌ఫిల్మ్స్‌ను అనేకమంది యువదర్శకులు సాక్షి మెయిల్ ఐడీకి  పంపిస్తున్నారు. తక్కువ పరిమాణంతో ఉన్న ఈ షార్ట్‌ఫిలిమ్‌ఫైల్స్‌ను జీమెయిల్ ద్వారా పంపవచ్చు. పరిమాణం విషయంలో జీమెయిల్ పరిధిని దాటితే జీమెయిల్‌తోనే అనుసంధానం అయిన గూగుల్‌డ్రైవ్ ద్వారా ఉచితంగానే పంపవచ్చు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే  గూగుల్ డ్రైవ్ ద్వారా పంపుతున్న వీడియోఫైల్‌ను సాక్షి మెయిల్ ఐడీకి  షేర్ చేయవలసి ఉంటుంది. ఇలా షేర్ చేసిన వీడియోలను మాత్రమే నిర్ణేతలు డౌన్‌లోడ్ చేసుకొని చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గూగుల్‌డ్రైవ్ ద్వారా పంపినవారు కూడా తమ వీడియోఫైల్స్‌ను షేరింగ్‌లో ఉంచారో లేదో గమనించాలి.

గడువు ఫిబ్రవరి 14 వరకే! అంటే... రేపే చివరి రోజు!
(వివరాల కోసం జనవరి 2 నుంచి 11ల మధ్యన వచ్చిన సాక్షి ‘ఫ్యామిలీ’ సంచికలు చూడండి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement