ఛాతీ మంట నుంచి ఉపశమనానికి... | Relief from the burning sensation in the chest | Sakshi
Sakshi News home page

ఛాతీ మంట నుంచి ఉపశమనానికి...

May 12 2014 11:09 PM | Updated on Sep 2 2017 7:16 AM

ఛాతీ మంట నుంచి ఉపశమనానికి...

ఛాతీ మంట నుంచి ఉపశమనానికి...

భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క చప్పరిస్తే ఛాతీమంట రాదు.

గృహవైద్యం
 
*భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క చప్పరిస్తే ఛాతీమంట రాదు.

*కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు వేసి మరిగించి మూతపెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం వడపోసి టీ స్పూన్ తేనె కలిపి పరగడుపున తాగితే అసిడిటీ తగ్గుతుంది.

*ఒక లవంగం ఒక ఏలక్కాయను పొడి చేసి బుగ్గన పెట్టుకుంటే ఛాతీమంట రాదు. ఇది నోటి శుభ్రతకు (మౌత్‌ఫ్రెషనర్) కూడా ఉపకరిస్తుంది.

* అర లీటరు నీటిలో ఒక టీ స్పూన్ షాజీర వేసి సన్నటి మంట మీద 15 నిమిషాల సేపు మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజుకు రెండు - మూడు సార్లు ఐదారు రోజులపాటు తాగితే అసిడిటీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

* అసిడిటీ ఉంటే జీర్ణరసాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగజిమ్మి ఆహారనాళంలోకి వస్తుంటాయి. దీంతో ఛాతీలో మంట అనిపిస్తుంది.
కడుపులో జీర్ణరసాలు వాటి నియమిత సమయానికి విడుదలవుతుంటాయి. కానీ  సమయానికి భోజనం చేయకపోతే... ఆమ్లపూరిత రసాల కారణంగా కడుపులో మంట వస్తుంటుంది. అలాగే ఘాటు మసాలాలతో కూడిన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఆమ్లాలు పైకి ఎగజిమ్మడంతో ఛాతీలో మంట వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement