breaking news
Acidity problem
-
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్‌మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
అసిడిటీ మందులు దీర్ఘకాలం వాడితే ఏమవుతుందో తెలుసా?
అజీర్ణం, త్రేన్పులు, ఛాతీలో మంట వంటి వాటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్ వంటి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే వీటిని దీర్ఘకాలం వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకల పటిష్ఠత తగ్గి.. తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది. నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరిశీలించింది. ఈ అధ్యయనంలో.. పీపీఐలు వాడేవారిలో తుంటిఎముక విరిగే ముప్పు 35 శాతం పెరిగినట్టు గుర్తించారు. ఈ మందులను ఆపేస్తే ఎముక విరిగే ముప్పు రెండేళ్లలోనే మామూలు స్థాయికి చేరుకుంటోంది కూడా. అందువల్ల అసిడిటీ మందులు మోతాదు మించి వాడకుండా ఉండటం మంచిది. -
Health Tips: ఎసిడిటీ బాధలు వేధిస్తున్నాయా? వాము, ధనియాలు, తేనె.. ఇంకా..
ఎసిడిటీ సమస్య ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అందుకు ప్రస్తుత జీవనశైలి ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎసిడిటీ వల్ల తరచుగా గుండె, కడుపు, గొంతులో మంట వంటి సమస్యలు సంభవిస్తాయి. ఒక్కోసారి తీవ్ర ఆనారోగ్యానికి కారణమౌతుంది. సమయానికి తినడం, బాగా నమలడం, భోజనం తర్వాత కనీసం అరగంట పాటు నిటారుగా కూర్చోవడం వంటి చిన్నపాటి అలవాట్లు ఆచరించడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. అలాగే వంటగదిలో దొరికే కొన్ని పధార్ధాల ద్వారా ఎసిడిటీని నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. వాము గింజలు వాములో బయోకెమికల్ థైమోల్ అనే క్రియాశీలక పధార్థం గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించి, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. స్పూన్ వాములో చిటికెడు ఉప్పు కలిపి తింటే తక్షణ ఉపశమనం ఉంటుంది. గ్లాస్ నీళ్లలో టీ స్పూన్ వాము కలిపి, ఒక గంట నినబెట్టి, రాత్రి నిద్రపోయే ముందు తాగినా ఫలితముంటుంది. సోంపు గింజలు భోజనం తర్వాత చిటికెడు సోపు గింజలు తీసుకోవడం పూర్వకాలం నుంచే సంప్రదాయంగా ఉంది. ఇది నోటి దుర్వాసన పోగొట్టడమేకాకుండా, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. పిల్లల్లో తరచూ వచ్చే కడుపునొప్పి ఉపశమనానికి సోంపు, పటిక బెల్లం (రాక్ షుగర్) మిశ్రమం బాగా పనిచేస్తుంది. సోంపు గింజలతో చేసిన టీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలు, పెరుగు పుల్లని త్రేన్పులకు చక్కటి విరుగుడు పాలు. గోరు వెచ్చని లేదా చల్లని పాలు ఎసిడిటీకి తక్షణ ఉపశమనాన్నిస్తాయి. పాలు సహజ యాంటాసిడ్‌లా పనిచేస్తుంది. పాలల్లో కాల్షియం లవణాలు అధికంగా ఉండటం వల్ల యాసిడ్‌ను వెంటనే తటస్థీకరిస్తుంది. ఎసిడిటీని నియంత్రించడానికి పెరుగు మరొక మార్గం. దీనిలో కాల్షియంతో పాటు, సహజమైన ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందిస్తుంది. తేనె గ్లాస్ నీళ్లలో టీస్పూన్ తేనె కలిపి తాగినా ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మిశ్రమానికి కొంచెం నిమ్మరసం కలిపి తాగితే కడుపులో పుల్లని త్రేన్పులకు కారణయ్యే ఆమ్లాలను తలస్థీకరిస్తుంది. కొత్తమీర లేదా ధనియాలు కొత్తమీర విత్తనాల (ధనియాలు) పొడి లేదా కొత్తిమీర ఆకులు ఏ విధంగా తీసుకున్నా ఎసిడిటీని తగ్గిస్తుంది. 10 మీ.లీ కొత్తిమీర రసాన్ని, నీళ్లలో కానీ మజ్జిగలోగానీ కలిపి తాగితే వెంటనే ఉపశమనం పొందవచ్చు. కొత్తిమీర ఆకులతో తయారుచేసిన టీ కూడా తాగవచ్చు. కడుపు ఉబ్బరాన్ని నివరించడమేకాకుండా వాంతులు, విరేచనాల నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది. తాజా పండ్లు సిట్రస్ పండ్లతో సహా అన్ని రకాల తాజా పండ్లు జీర్ణక్రియ మెరుగుపరచడమేకాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫైబర్‌ను కూడా అందిస్తాయి. రోజూ రెండు తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఎసిడిటీని నియంత్రించవచ్చు. చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..! -
ఛాతీ మంట నుంచి ఉపశమనానికి...
గృహవైద్యం *భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క చప్పరిస్తే ఛాతీమంట రాదు. *కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు వేసి మరిగించి మూతపెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం వడపోసి టీ స్పూన్ తేనె కలిపి పరగడుపున తాగితే అసిడిటీ తగ్గుతుంది. *ఒక లవంగం ఒక ఏలక్కాయను పొడి చేసి బుగ్గన పెట్టుకుంటే ఛాతీమంట రాదు. ఇది నోటి శుభ్రతకు (మౌత్‌ఫ్రెషనర్) కూడా ఉపకరిస్తుంది. * అర లీటరు నీటిలో ఒక టీ స్పూన్ షాజీర వేసి సన్నటి మంట మీద 15 నిమిషాల సేపు మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజుకు రెండు - మూడు సార్లు ఐదారు రోజులపాటు తాగితే అసిడిటీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. * అసిడిటీ ఉంటే జీర్ణరసాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగజిమ్మి ఆహారనాళంలోకి వస్తుంటాయి. దీంతో ఛాతీలో మంట అనిపిస్తుంది. కడుపులో జీర్ణరసాలు వాటి నియమిత సమయానికి విడుదలవుతుంటాయి. కానీ సమయానికి భోజనం చేయకపోతే... ఆమ్లపూరిత రసాల కారణంగా కడుపులో మంట వస్తుంటుంది. అలాగే ఘాటు మసాలాలతో కూడిన ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఆమ్లాలు పైకి ఎగజిమ్మడంతో ఛాతీలో మంట వస్తుంది.