కొత్త ప్లాస్టిక్‌తో  నిరంతరం రీసైక్లింగ్‌! | Recycling constantly with new plastic | Sakshi
Sakshi News home page

కొత్త ప్లాస్టిక్‌తో  నిరంతరం రీసైక్లింగ్‌!

Apr 30 2018 12:02 AM | Updated on Apr 30 2018 12:02 AM

Recycling constantly with new plastic - Sakshi

ఈ రోజుల్లో ప్లాస్టిక్‌ తెచ్చే చిక్కుల గురించి తెలియందెవరికి? కాకపోతే ఇంకో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి తప్పనిసరిగా దాన్నే వాడుతున్నాం. ఇకపై ఈ సమస్య లేదు. ఎందుకంటే... కొలరాడో స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ప్లాస్టిక్‌ను తయారు చేశారు కాబట్టి. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీసైకిల్‌ చేసుకోగలగడం దీని ప్రత్యేకత! ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌ను కొన్ని సార్లు మాత్రమే రీసైకిల్‌ చేసుకోవచ్చునన్నది తెలిసిందే.  అంతేకాదు... అందుకోసం ప్రమాదకరమైన రసాయనాలను కూడా వాడాల్సి వస్తోంది. కొలరాడో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త రకం ప్లాస్టిక్‌ తేలికగా ఉండటంతోపాటు దృఢంగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నడంతోపాటు వేడిని కూడా సమర్థంగా తట్టుకోగలదు.

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ కొత్త ప్లాస్టిక్‌ ఉపయోగపడుతుందని నిపుణులు
అంచనా  వేస్తున్నారు. సాధారణ ప్లాస్టిక్‌ తయారీ కంటే తక్కువ ఖర్చు, కాలుష్యంతో దీన్ని తయారు చేసుకోగలగడం ఇంకో విశేషం. మళ్లీమళ్లీ రీసైకిల్‌చేసుకునే అవకాశం ఉండటం వల్ల కొత్త ప్లాస్టిక్‌ తయారీకి స్వస్తి చెప్పవచ్చునని అనుకుంటున్నారు. క్రమేపీ ఈ కొత్త ప్లాస్టిక్‌ అందరికీ అందుబాటులోకి వస్తే, సమస్యలు  
చాలావరకు తొలగిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement