 
															మహాత్ముని సూక్తి
మొదట వారు నిన్ను విస్మరిస్తారు.
	మొదట వారు నిన్ను విస్మరిస్తారు.
	తర్వాత నిన్ను చూసి నవ్వుతారు.
	ఆ తర్వాత నీతో పోరాటం చేస్తారు.
	అప్పుడు నువ్వే గెలుస్తావు.
	 
	నీ అనుమతి లేకుండా
	నిన్నెవరూ బాధపెట్టలేరు.
	 
	ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పేదో నీతోనే మొదలవాలి.
	 
	కుండెడు బోధల కంటే
	గరిటెడు ఆచరణ గొప్పది.
	 
	 బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు..
	ఎందుకంటే క్షమించడానికి
	ఎంతో ధైర్యం కావాలి.
	 
	నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే
	వెంటనే మరచిపో!
	ఎవరి నుంచైనా సహాయం పొందితే
	జీవితాంతం గుర్తుంచుకో!!
	 
	రేపే చనిపోతానన్నట్టుగా జీవించు
	ఎప్పటికీ జీవించే ఉంటానన్నంతగా నేర్చుకో.
	 
	కంటికి కన్నే పరిష్కారమైతే ఈ ప్రపంచమే గుడ్డిదవుతుంది.
	నిన్ను నువ్వు కనుగొనడానికి మార్గం ఇతరుల సేవలో నిన్ను నువ్వు మరచిపోవడమే.
	నీ ఆలోచనలే నువ్వు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
