ప్రియాకృతి | priyanka chopra new fashion dress | Sakshi
Sakshi News home page

ప్రియాకృతి

Nov 16 2017 11:23 PM | Updated on Nov 16 2017 11:24 PM

priyanka chopra new fashion dress - Sakshi

దుస్తులు తయారుచేసే కళ ప్రియంకాచోప్రాలో లేదు కానీ, ఏ దుస్తులు... వేసినా కళకళలాడుతుంది ఆకృతికి తగినట్టు ఉండేలా దుస్తుల ఎంపికలో మనమూ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ వేడుకలోనైనా ప్రియాకృతిలా వెలిగిపోవచ్చు.

ఇది సింగిల్‌పీస్‌ గౌన్‌. ఫిష్‌కట్‌ డిజైన్‌ కావడంతో శరీరాకృతిని అందంగా చూపుతుంది. ఈ గౌన్‌కి బాటమ్‌లో లేయర్‌ కట్‌ ఇచ్చి క్రాస్‌ వచ్చేలా కుట్టారు. ఇలాంటి డ్రెస్‌ బర్త్‌డే పార్టీలు, చిన్న చిన్న గ్యాదరింగ్స్‌కి బాగుంటుంది. మంచి శరీరాకృతి ఉన్నవారు చాలా తక్కువ ఆభరణాలతో ఇలాంటి డ్రెస్‌ను ధరించాలి.

ఇది ఇండోవెస్ట్రన్‌ డ్రెస్‌. టాప్, బాటమ్‌ విత్‌ ఓవర్‌ కోటుతో ఈ స్టైల్‌ తీసుకురావచ్చు. ఇండియన్‌ ఎంబ్రాయిడరీ జర్దోసీ వర్క్‌తో  కోటు ని అందంగా తీర్చిదిద్దారు. శాటిన్‌ ఫ్యాబ్రిక్‌ తో టాప్, బాటమ్‌ ని డిజైన్‌ చేశారు. అఫీషియల్‌ మీటింగ్స్,  పార్టీలకు ఈ తరహా డ్రెస్సింగ్‌ బాగా నప్పుతుంది.

లేస్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన దుస్తుల్లో ఏ అమ్మాయి అయినా  అందంగా కనిపిస్తారు. ఈ డ్రెస్‌ కాటన్‌ ఫ్యాబ్రిక్‌ మీద లేస్‌ని జత చేసి డిజైన్‌ చేశారు. బాటమ్‌గా స్కర్ట్‌ డిజైన్‌ చేశారు. స్కర్ట్‌ వద్దనుకుంటే బాటమ్‌గా పెన్సిల్‌ కట్‌ ప్యాంట్‌ వేసుకోవచ్చు.


ఈ స్కర్ట్‌ హ్యాండ్‌ ఓవెన్‌ బెనారసీ స్కర్ట్‌. దీని మీద పికాక్‌ మోటివ్స్‌ అందంగా అమరాయి. ఈ స్కర్ట్‌ మీదకు ప్లెయిన్‌ ఐవరీ శాటిన్‌ షర్ట్‌ వేయడంతో రిచ్‌ లుక్‌ వచ్చేసింది. సాయంకాలాలు జరిగే ఏ వేడుకకు ఈ కాంబినేషన్‌ డ్రెస్‌ ధరించినా స్టైలిష్‌గా కనిపిస్తారు.

ఈ శారీ సిల్వర్‌ టిష్యూ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేశారు. దీని మీద గోల్డెన్‌ జర్దోసీ ఎంబ్రాయిడరీ చేసి, పూర్తి కాంట్రాస్ట్‌ పింక్‌ బార్డర్‌ ఇచ్చారు. దీని వల్ల యూత్‌ఫుల్‌ లుక్‌ వచ్చేసింది.

ఇది పూర్తి వెస్ట్రన్‌ లుక్‌. ఈవెనింగ్‌ వేర్‌గా అమ్మాయిలు బాగా ఇష్టపడే డ్రెస్‌. ఇది స్ట్రెచబుల్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేశారు. బాటమ్‌లో ఫ్రీ ఐరన్‌ ఫ్యాబ్రిక్‌ని జత చేశారు. లేయరీ ఎఫెక్ట్‌ ఇవ్వడంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది ఏ ఈవెనింగ్‌ పార్టీకి ధరించినా సూపర్బ్‌ అనే ప్రశంసలు పొందుతారు.
- భార్గవి కూనమ్‌ ఫ్యాషన్‌  డిజైనర్‌

Advertisement
 
Advertisement
Advertisement