సరైన విధంగా ఎత్తు పెరగకపోతే..? | Peragakapote the correct height ..? | Sakshi
Sakshi News home page

సరైన విధంగా ఎత్తు పెరగకపోతే..?

Sep 2 2013 11:24 PM | Updated on Sep 1 2017 10:22 PM

సరైన విధంగా ఎత్తు పెరగకపోతే..?

సరైన విధంగా ఎత్తు పెరగకపోతే..?

మన సమాజంలో ఎత్తు పెరగడం లేదనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఎదిగే వయసులోని టీనేజీ పిల్లల్లో, యుక్తవయస్కులలో ఈ ఆవేదన ఎక్కువ.

మన సమాజంలో ఎత్తు పెరగడం లేదనే ఆందోళన చాలామందిలో ఉంటుంది.  ముఖ్యంగా ఎదిగే వయసులోని టీనేజీ పిల్లల్లో, యుక్తవయస్కులలో ఈ ఆవేదన ఎక్కువ. అయితే ఎత్తు తక్కువగా ఉండటం వ్యాధి కాదు. సాధారణంగా తల్లిదండ్రులు తక్కువ ఎత్తు ఉంటే పిల్లలూ తక్కువగా ఎత్తుపెరుగుతారు. అయితే ఒక్కోసారి మాత్రం తగినంతగా ఎత్తు పెరగకపోవడం అన్నది ఏదో వ్యాధి కారణంగా కూడా జరగవచ్చు. అప్పుడా సమస్యకు చికిత్స చేయవచ్చు.
 
 ఎత్తు పెరగకపోవడానికి కారణాలు...

 1. ఎఖాండ్రోప్లేసియా (జన్యుపరంగా వచ్చే సమస్యతో ఎత్తుపెరగకపోవడం); 2. దీర్ఘకాలిక వ్యాధులు, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, మూత్రసంబంధ వ్యాధులు, సికిల్‌సెల్ అనీమియా, థలసీమియా, యుక్తవయసులో వచ్చే కీళ్లనొప్పులు (జువెనైల్ డయాబెటిక్ ఆర్థరైటిస్), మధుమేహం (డయాబెటిస్) వంటి వ్యాధుల వల్ల 3. పెరుగుదల నెమ్మదిగా ఉండటం (కాన్‌స్టిట్యూషనల్ గ్రోత్ డిలే), 4. కుషింగ్స్ డిసీజ్, 5. యుక్తవయసు నెమ్మదిగా రావడం, 6.డౌన్స్ సిండ్రోమ్, 7. హైపోథైరాయిడిజం పుట్టుకతోనే ఉండటం, 8. పేగులో వాపు, 9. పేగులో పుండు, 10. పౌష్టికాహారలోపం, 11.నూనాన్ సిండ్రోమ్, 12. పాన్‌హైపోపిట్యుటరిజమ్, 13. పెరుగుదల హర్మోన్ తగ్గుదల, 14. ప్రికాషియస్ ప్యూబర్టీ యుక్తవయసు ముందుగానే రావడం,  15. రికెట్స్, 16. రసెల్ సిల్వర్ సిండ్రోమ్, 17. టర్నర్ సిండ్రోమ్, 18.విలియమ్స్ సిండ్రోమ్.
 
 ఎత్తు అన్నది తల్లిదండ్రుల నుంచి జన్య్యుపరంగా సంక్రమిస్తుంది. అయితే ఒకవేళ ఏదైనా వ్యాధి కారణంగా ఎత్తుపెరగకపోవడం జరిగితే, దానికి సంబంధించిన చికిత్స అవసరమవుతుంది. అప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేస్తారు. జన్యుపరమైన లోపాలు ఏవైనా ఉన్నాయేమోనని చూస్తారు.  
 
 ఎత్తు అనేది వంశపారంపర్యంగా వచ్చేదే అయినా ఏదైనా వ్యాధి లేదా వైద్యసమస్య వల్ల పెరుగుదలలో లోపాలు ఉంటే హోమియో విధానంలో బెరైట్ గ్రూపు మందులు, కాల్కేరియా ఫాస్, కాల్కేరియా కార్బ్, బెరైటా కార్బ్, మెడొరినం, తూజా వంటి మందులు హోమియో నిపుణుల ఆధ్వర్యంలో వారు సూచించిన మోతాదుల్లో వాడాల్సి ఉంటుంది.
 
 డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement