కుమార్ గౌరవ్ | One Film Wonder | Sakshi
Sakshi News home page

కుమార్ గౌరవ్

Sep 27 2015 11:08 PM | Updated on Sep 3 2017 10:05 AM

కుమార్ గౌరవ్

కుమార్ గౌరవ్

కుమార్ గౌరవ్ అనగానే ‘యాద్ ఆ రహీ హై’... ‘దేఖో మైనే దేఖా హై ఏక్ సప్‌నా’...

వన్ ఫిల్మ్ వండర్

కుమార్ గౌరవ్ అనగానే ‘యాద్ ఆ రహీ హై’... ‘దేఖో మైనే దేఖా హై ఏక్ సప్‌నా’... వంటి సూపర్ హిట్ పాటలు గుర్తుకు వస్తాయి. అవి అతడి తొలి సినిమా ‘లవ్ స్టోరీ’లోనివి. చాలా పెద్ద హిట్ అయిన ఈ సినిమా తర్వాత కుమార్ గౌరవ్ పెద్ద స్టార్‌గా ఎదుగుతాడని అందరూ అనుకున్నారు. తండ్రి రాజేంద్ర కుమార్ వంటి పెద్ద స్టార్ అండదండలు ఉండటం కూడా అందుకు కారణం కావచ్చు. కాని కుమార్ గౌరవ్ ఒన్ ఫిల్మ్ వండర్‌గానే ఉండిపోయాడు. ఆ తర్వాత అతడి ఏ సినిమాలూ పెద్ద విజయం సాధించలేదు.

చివరకు అతడు సంజయ్ దత్ బావగారి హోదాలో మిగిలాడు. సంజయ్‌దత్ చెల్లెలు నమ్రతా దత్‌ను పెళ్లి చేసుకోవడంతో కొన్నాళ్లు సంజయ్ అతడికి లిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నించినా ఎక్కడైనా బావగాని వెండితెర మీద కాదు అని ప్రేక్షకులు తేల్చారు. కుమార్ గౌరవ్ కుమార్తెను ‘పాకీజా’ దర్శకుడు అలనాటి నవాబు కమాల్ అమ్రోహి మనవడు పెళ్లి చేసుకున్నాడు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement