నా జీవితంలో ఒకరోజు...

One Boy Two Girls Beautiful Love Story - Sakshi

కొన్ని యుగాలైనా కొందరిని మరిచిపోలేం అంటే నమ్మేవాణ్ని కాదు ప్రియా అనే అమ్మాయి నా జీవితంలోకి వచ్చే వరకు.

ప్రియా.. ఒక అందమైన ఙ్ఞాపకం.. నేను బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులవి. నేనొక మిడిల్ క్లాస్ అబ్బాయిని, అమ్మానాన్న కాళ్ళావేళ్లా పడితే నాకొక స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారు, అప్పటికే నా ఫ్రెండ్స్ అంతా స్మార్ట్‌ఫోన్లు కొనుక్కొని వాట్సాప్ చాటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అప్పటి వరకు నాకు ఫోన్ లేదు కాబట్టి అమ్మాయిలతో చాటింగ్ సంబందాలు కూడా చాలా తక్కువే ఉండేవి, అనుకోకుండా ఒకసారి ఒక నంబర్ నుండి నాకు వాట్సప్ మెసేజ్ వచ్చింది, పేరు అడిగితే రమ్య అని చెప్పింది, ఎలాగొలా మేమిద్దరం చాలా మంచి స్నేహితులమయ్యాం, రోజు రోజుకి మా మధ్య దూరం తగ్గుతూ వచ్చింది, అనుకోకుండా ఒకసారి ఆ అమ్మాయే నాకు లవ్ ప్రపోజ్ చేసింది. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు అలోచించడానికి కాస్త టైమ్ కావాలని అడిగాను. సరే అని వేరే అలోచనలోకి వెళ్లిపోయా...

ప్రియా.. నా ఇంటర్ క్లాస్‌మెట్. తనది మా ఊరే. ఇద్దరం ఒకటే కాలేజి అయినప్పటికి మా సెక్షన్స్ వేరు. చదువుతున్న సమయంలో అమెను నేను చూడటం తను నన్ను చూడటం తప్ప మేము పెద్దగా మాట్లాడుకుంది ఎప్పుడూ లేదు. తను అందంగా లేకపోయినా తన మొహంలో ఏదో తెలియని అమాయాకత్వం, కళ్లతొ మాట్లడే నేర్పరితనం నన్ను బాగా అకర్షించింది. అందుకేనేమో ఎంతమంది అమ్మాయిఉన్నా నా చూపు మాత్రం అమె వైపే ఉండేది. అలా చూస్తూండగానే ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, మా కాలేజి వాళ్లు పెయిర్‌వెల్ పార్టీని గ్రాండ్‌గా ఏర్పాటు చేసారు, ఒకవైపు పైచదువులకు వెళ్తున్నాం అనే అనందం కంటే ఎక్కువగా ప్రియాను మిస్ అవుతున్నాననే బాధనే నాలో ఎక్కువైంది. నా ఫ్రెండ్ రాహుల్‌కి నా విషయం చెప్పాను, ఇంతలో వాడు నాకొక సలహా ఇచ్చాడు, అదేమంటే ప్రియాని నేరుగా కలిసి నా ప్రేమ విషయం చెప్పుమన్నాడు. నాలో ఏదో తెలియని భయం మొదలయింది. రాహుల్ చెప్పినట్టు ప్రియాకి నా విషయం చెప్పాక అమె నన్ను అసహించుకుంటే ఇప్పటి వరకు మా మధ్యున్న స్నేహం కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది.

అయినా ధైర్యం చేసుకొని ఎలాగైనా  చెప్పెద్దామని అమె దగ్గరికి వెళ్లా. ప్రియా,వాళ్ల స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళినా అమె నన్ను చూసినట్టు నాకు అనిపించలేదు. అ క్షణంలో నా మనసులో ఎవేవో అలోచనలు మొదలవుతున్నాయి. నా పక్కనే ఉన్న గులాబీల నుండి ఒక గులాబిని నా చేతిలోకి తీసుకొని నా వెనుకలా దాచిపెట్టుకున్నాను, ఇంతలో నా వైపుగా చూసింది ప్రియా. నాకు చాలా భయమెసింది. భయపడుతునే హాయి ప్రియా అన్నాను, అమె ఎంటి ఇలా వచ్చావు అని అడిగింది. నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అంతలో ప్రియ నా చేతిలోని గులాబిని చూసి ఎంటది అని అడిగింది. నేను బదులుగా ఆ గులాబిని తన ఇచ్చి ప్రేమిస్తున్నానని చెప్పాను. ఒక్కసారిగా ప్రియా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక ఆ రోజు నుండి నేను ఎప్పూడు అమెను కలవలేదు. అమె నాతో మాట్లాడలేదు.

రమ్య నా అలోచనలకి కొత్త రూపం ఇచ్చింది. కలిసింది అన్‌లైన్ చాటింగ్‌లో అయినా నాకు రమ్య అంటే ఎంతో కొంత నమ్మకం ఎర్పడింది. నిజం చెప్పాలంటే రమ్యతో మాట్లడితే ప్రియతో మాట్లాడిన ఫీలింగ్ కలిగేది. మళ్ళీ నాలో ఆలోచన మొదలైంది రమ్యకు ఓకే చెప్పాలా వద్ద అని, కారణం ప్రియా.. ప్రియాని నేనింకా మర్చిపోలేదు, ఇంటర్ అయిపోగానే నేను బిటెక్ లో చేరాను. తను ఎలా ఉందొ ఎక్కడ ఉందో తన ఫ్రెండ్స్‌కి కూడా చెప్పలేదు. నాకు చిన్న ఆశ ఎప్పూడొ ఒకసారి ప్రియా నాకు దగ్గరవుతుందని. ఇంతలో నా ఫోన్‌కి మెసేజ్ వచ్చింది రమ్య దగ్గరినుండి. మనం రేపు ఒకసారి కలుద్దాం అని నేను ఏమీ అలోచించకుండా సరే అన్నాను. మరుసటి రోజు ఉదయం రమ్య దగ్గరినుండి కాల్ వచ్చింది. సాయంత్రం పార్క్‌లో కలుద్దాం అని చెప్పి పెట్టెసింది. నేను తనని వాట్సప్ ప్రోఫైల్ లొ చూసిందే తప్ప బయట కలిసి మట్లాడింది లేదు. ఈ రోజే మొదటి సారి తనని కలవడం. నా అలోచనలని పక్కన పెట్టెసి పార్క్‌కి బయలుదేరాను.

కాసేపటికి పార్క్‌ లోపలికి వెళ్ళి ప్రియా కోసం  ఎంట్రన్స్ వైపు అసక్తిగా ఎదురుచూసాను. ఇంతలో పార్క్‌ ఎంట్రీ వైపు నుండి ఒకావిడా లోపలికి వస్తుంది. నాలో ఎదో అలజడి మొదలయింది. ఒక్కసారిగా నా ముఖాన్ని వెనక్కి తిప్పుకున్నాను. అమె మోహం కూడా నేను సరిగా చూడలేదు. కానీ అవిడా మాత్రం మెల్లిగా నా వైపే అడుగులు వేస్తోంది. నాలో అలజడి ఇంకాస్త ఎక్కువైంది. అమె నా దగ్గరి వరకు వచ్చి పవన్ అని పిలిచింది. నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి అమె ముఖాన్ని చూసాను. ఎదురుగా ఉన్నది ప్రియా..! నాలో చెప్పలేనంత అనందం ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నా ముందుంది. అనందం పట్టలేక ఎంటి నువిక్కడ అని అడిగాను. అమె ఫ్రెండ్‌తో కలిసి వచ్చాను అని చెప్పింది. నేను కూడా ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చా అని చెప్పాను. కాసేపు మాట్లాడుకున్నాం.

ఆమె పక్కన ఉన్నంత సేపు నాకు రమ్య గుర్తుకే రాలేదంటే నాకే అర్థం కాలేదు. అలా ఒక రెండు గంటలు మాట్లడుకున్నాక ప్రియాకి కాల్ వచ్చింది ఎదో ముఖ్యమైన పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వత నేను కూడా రమ్య ఫోన్‌కి కాల్ చేస్తుంటే స్విచ్‌‌ఆఫ్ అని వస్తుంది. సరే అని నేను అక్కడి నుండి కార్‌లో ఇంటికి బయలుదేరాను, ఎవేవో అలోచనలు నా మదిని వెంటాడుతునే ఉన్నాయి, ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది, ఎదో కొత్త నంబర్, లిఫ్ట్ చేసి హాలో ఎవరు అనగానే నేను రమ్యను మర్చిపోయావా అని రమ్య మాట్లాడింది. నేను బదులుగా ఈ రోజు కలుస్తా అన్నవుగా ఎందుకు కలవలేదు అని అడిగా. అదేంటి మనం కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాం కదా అని రమ్య బదులిచ్చింది. పవన్ ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్ళిపోయాడు. అంటే ఇన్ని రోజులు నాతో చాటింగ్ చేసింది. ఫోన్లు మాట్లాడింది ప్రియానా..! నేను అనందంతో ప్రియా అన్నాను. ఇన్ని రోజులకి గుర్తు పట్టావా అని ఒక నవ్వు నవ్వింది. తర్వాత మేము చాలా సార్లు కలిసి మాట్లాడుకున్నాం, చివరికి వాళ్ల అమ్మనాన్నని మా అమ్మనాన్నని ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top