నవంబర్ 24న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | November 24 birthday Celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 24 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Nov 24 2015 3:48 AM | Updated on Sep 3 2017 12:54 PM

నవంబర్  24న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 24న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
అరుంధతీ రాయ్ (రచయిత్రి), సెలీనా జైట్లీ (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతు సంఖ్య కావడం వల్ల ఆధ్యాత్మికోన్నతి సాధిస్తారు. ఇంటాబయటా వీరి మాటకు విలువ ఏర్పడుతుంది. వేదపండితులు, జ్యోతిష్యులకు, వైద్యులకు, వైద్యవిద్యార్థులకు మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతానప్రాప్తి కలుగుతుంది. పుట్టిన తేదీ 24. ఇది శుక్ర సంఖ ్య కాబట్టి వీరు చక్కటి రూపం, శారీరక సౌష్టవం కలిగి ఉండి, ఎంతో అదృష్టాన్ని, ఆనందాన్ని పొందుతారు. సృజనాత్మకత, కళాత్మక హృదయం, అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. వీరికి ఈ సంవత్సరం ఎంతో ప్రోత్సాహవంతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం ఉండవచ్చు. కొత్త వాహనాలు కొంటారు. విలువైన వస్త్రాభరణాలకి ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం, ఆర్థిక ఉన్నతి పొందుతారు.

రాజకీయాలలో ఉన్న వారికి పదవీప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో, కోరుకున్న విద్యాసంస్థలలో సీటు లభిస్తుంది. ఆగిపోయిన చదువును తిరిగి కొనసాగిస్తారు. పోటీపరీక్ష లలో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3,5,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, ఎల్లో, రెడ్, ఆరెంజ్. లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు. సూచనలు: శుక్రజపం చేయించుకోవడం, ప్రేమవ్యవహారాలకు దూరంగా ఉండటం, ఖర్చులను అదుపులో పెట్టుకోవడం, పేద అవివాహిత కన్యల పెళ్లికి తగిన సాయం చేయడం మంచిది. అలాగే, భూమిని, ఇంటిని అమ్మే ప్రయత్నాన్ని విరమించుకోవడం, ప్రాపంచిక జీవనంపై దృష్టి పెట్టడం, గణపతి హోమం లేదా కేతు గ్రహ జపం చేయించుకోవడం, వికలాంగులను ఆదరించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement