కాలక్షేపం కాదు... ఆరోగ్యం నిక్షేపం! | Not to be entertained health repayment | Sakshi
Sakshi News home page

కాలక్షేపం కాదు... ఆరోగ్యం నిక్షేపం!

Sep 15 2017 12:10 AM | Updated on Sep 22 2017 9:05 PM

కాలక్షేపం కాదు... ఆరోగ్యం నిక్షేపం!

కాలక్షేపం కాదు... ఆరోగ్యం నిక్షేపం!

కాలక్షేపం బఠాణీలు అంటూ వాటిని తింటుంటాం.

గుడ్‌ ఫుడ్‌

కాలక్షేపం బఠాణీలు అంటూ వాటిని తింటుంటాం. కానీ బఠాణీల వల్ల ఒనగూరే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని
ఇవి...


⇔బఠాణీల్లో పీచు పాళ్లు, ప్రోటీన్లు చాలా ఎక్కువ. పీచు, ప్రోటీన్లు చక్కెరలను నెమ్మదిగా జీర్ణమయ్యేలా చూస్తాయి. అందుకే డయాబెటిస్‌ రోగులకు బఠాణీలు చాలా మంచిది   
 
⇔బఠాణీల్లో ఉండే పీచు పదార్థం జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంతో పాటు మంచి జీర్ణశక్తికి దోహదం చేస్తుంది

⇔బఠాణీల్లో ఫోలిక్‌ యాసిడ్‌ పాళ్లు ఎక్కువ. కాబోయే తల్లుకు ఫోలిక్‌ యాసిడ్‌ చాలా మేలు చేస్తుంది.

⇔ అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకునేవారికి, కాబోయే తల్లులకు బఠాణీలు మేలు చేస్తాయి

⇔బఠాణీల్లో ఉండే విటమిన్‌ బి 6, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి పోషకాలు ఉన్నందున అవి గాయాల తాలూకు ఇన్‌ఫ్లమేషన్‌ను (ఎర్రబారడం, నొప్పి, మంట) త్వరగా తగ్గిస్తాయి.

⇔ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువ కాబట్టి అవి గాయాలను త్వరగా మాన్పుతాయి

⇔బఠాణీలు చర్మానికి నిగారింపును కూడా ఇస్తాయి

⇔బఠాణీల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. అందుకే అవి ఎన్నోరకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంటాయి. అంతేగాక వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అనర్థాలను తగ్గిస్తాయి.

⇔ఫ్రీ–రాడికల్స్‌ను హరించే గుణం వల్ల అవి పెరిగే వయసును కనిపించనివ్వకుండా చేస్తాయి. చర్మంపై ముడుతలు రాకుండా చూస్తాయి

⇔ఆస్టియోపోరోసిస్‌ను అరికట్టే గుణం బఠాణీలకు ఉంది .

⇔బఠాణీలలోని విటమిన్‌–కెతో పాటు ఉండే ఇతర పోషకాలు వయసు పెరిగాక మతిమరపును తెచ్చే అలై్జమర్స్‌ డిసీజ్‌ను అరికడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement