
మూడ్ బాగుండాలంటే... ఆ మూడు సినిమాలు చాలు!
విసుగ్గా ఉన్నప్పుడు, అకారణంగా అసహనానికి గురవుతున్నప్పుడు, కుంగుబాటు దరి చేరుతున్నప్పుడు... మూడు డి.వి.డి లను చేతిలోకి తీసుకుంటాను.
లాఫింగ్ మంత్ర
విసుగ్గా ఉన్నప్పుడు, అకారణంగా అసహనానికి గురవుతున్నప్పుడు, కుంగుబాటు దరి చేరుతున్నప్పుడు... మూడు డి.వి.డి లను చేతిలోకి తీసుకుంటాను. అవి నన్ను విపరీతంగా నవ్విస్తాయి. నాలో కొత్త శక్తిని నింపుతాయి. ఆ మూడు సినిమాల డి.వి.డిలు ఏమిటంటే...
పడోసన్: ఈ రొమాంటిక్ కామెడీని ఇప్పటి తరం కూడా ఎంజాయ్ చేయగలదు. బిందు, బోల, కన్వర్ జీ, విద్యాపతి, పిళ్ళై... ఇలా ప్రతి పాత్ర మనల్ని నవ్విస్తుంది.
‘ఏ లడ్కీ మోడ్రన్ ఔర్ ఫార్వర్డ్ హై’ లాంటి సరదా డైలాగులకు కొదవలేదు. నటులలోని అరుదైన హాస్యరస ప్రతిభను వెలికి తీసిన సినిమా ఇది.
చల్తీ కా నామ్ గాడీ: మూడు గంటల సినిమా, ఏడు పాటలు... అయినా సరే... రెండు నిమిషాలు కూడా బోర్ కొట్టదు. మధుబాల, కిషోర్ కుమార్‌ల కామిక్ రిథమ్ పక్కాగా ట్యూన్ అయింది. ఈ సినిమా చూస్తే... నవ్వుల రథం ఎక్కినట్లే!
జానే భీ దో యారోం: సామాజిక-రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషిస్తూనే ప్రేక్షకులను నవ్వించే సినిమా. సీరియస్ విషయాన్ని కూడా సీరియస్‌గానే చెప్పనక్కర్లేదనీ నవ్విస్తూ కూడా చెప్పవచ్చునని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.