ఉపేంద్ర కల్ట్‌ సినిమా రీ-రిలీజ్‌ చేస్తున్న 'మైత్రీ మూవీస్‌' | Upendra Re-Release: Cult Classic Returns to Theaters on October 11 | Mythri Movie Makers | Sakshi
Sakshi News home page

ఉపేంద్ర కల్ట్‌ సినిమా రీ-రిలీజ్‌ చేస్తున్న 'మైత్రీ మూవీస్‌'

Oct 9 2025 2:14 PM | Updated on Oct 9 2025 2:59 PM

Upendra movie Re Release Trailer out now

కన్నడ హీరో ఉపేంద్ర(Upendra ) నటించిన కల్ట్‌ సినిమా ఉపేంద్ర రీ- రిలీజ్‌ (Upendra Re-Release) కానుంది. ఈ మేరకు ట్రైలర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేయనుంది. 1999లో విడుదలైన ఈ చిత్రానికి భారీ కల్ట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఇందులో ఉపేంద్ర, రవీనా టాండన్ , ప్రేమ మరియు దామిని నటించారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం కూడా ఉపేంద్రనే కావడం విశేషం. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేశారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా ఈ మూవీ రెండు ఫిలిం ఫేర్‌ అవార్డ్‌లను సొంతం చేసుకుంది.

ఉపేంద్ర చిత్రాన్ని అక్టోబర్‌ 11న రీరిలీజ్‌ చేస్తున్నట్లు  మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పేర్కొంది. ఈ మేరకు ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ఈ మూవీలో కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నప్పటికీ కథను తెరకెక్కించిన విధానం బాగుందని ప్రశంసలు వచ్చాయి. దీంతో యూత్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. ఉపేంద్ర పాటలు కూడా అప్పట్లో పెద్ద సెన్సేషన్‌ అయ్యాయి. ఇప్పటికీ ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌ సోషల్‌మీడియాలో వైరల​ అవుతూనే ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement