నూలు విధాలు

new type of casual wear will be brought to the season - Sakshi

ఫ్యాషన్‌

దారాలెన్నింటినో ఒద్దికగా పేర్చితే... ఆ అల్లిక ఒక నేత చీరగా రూపుకడుతుంది. స్టైల్స్‌ ఎన్నింటినో పొందికగా కూర్చితే ఆ కొత్తదనం చీరంత అందమై కొలువుదీరుతుంది. నూలు దారాలన్నీ వినూత్నమై ఇలా నూలు విధాలుగా వెలుగొందుతాయి.

నిన్నామొన్నటి వరకు కాటన్‌ చీరలు అంటే అమ్మాయిలు వాటిని ఆమడదూరం పెట్టేసేవారు. అవి పెద్దవారి జాబితా అంటూ పెదవి విరిచేవారు. ఇప్పుడు నయా స్టైల్‌ వచ్చింది. కంచి, ఖాదీ, లినెన్, మల్‌.. హ్యాండ్లూమ్‌ కాటన్‌ చీర ఏదైనా అమ్మాయిలు, అమ్మలు ఇలా కాటన్‌ కట్టులో కొత్తదనం తీసుకు వస్తున్నారు. ధరించే బ్లౌజ్‌తో అట్రాక్టివ్‌ లుక్‌ తీసుకువస్తున్నారు. ఈ ఇండోవెస్ట్రన్‌ లుక్‌ క్యాజువల్‌ వేర్‌గానే కాదు, సీజన్‌కి తగ్గట్టు పార్టీ వేర్‌గానూ హంగామా క్రియేట్‌ చేస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top