తడిచెత్తతో  కొత్త ఇంధనం... | New fuel with tar ... | Sakshi
Sakshi News home page

తడిచెత్తతో  కొత్త ఇంధనం...

Dec 6 2018 12:33 AM | Updated on Apr 4 2019 5:04 PM

New fuel with tar ... - Sakshi

భూతాపోన్నతి పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచం కొత్త కొత్త ఇంధనాల వేటలో పడింది. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఏ ముడిసరుకు నుంచైనా ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఆహారపు వ్యర్థాలతోపాటు తడిచెత్త (పంది వ్యర్థం తదితరాలు)లతో డీజిల్‌ లాంటి ఇంధనం తయారు చేయడంలో విజయం సాధించారు. సాధారణ డీజిల్‌కు ఈ కొత్త ఇంధనాన్ని కలుపుకుంటే సామర్థ్యం పెరగడంతోపాటు  కాలుష్యమూ తగ్గుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న బ్రజేంద్ర శర్మ అనే శాస్త్రవేత్త తెలిపారు.

అమెరికాలో ఏటా దాదాపు 8 కోట్ల టన్నుల తడిచెత్త వృథా అవుతుంటుందని ఇందులో ఏ కొంచెం ఇంధనంగా మారినా ఎంతో ప్రయోజనం ఉంటుందని బ్రజేంద్ర వివరించారు. పది నుంచి 20 శాతం ఇంధనాన్ని డీజిల్‌లో కలిపితే చాలు శక్తి ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని వివరించారు. ప్రస్తుతం తాము ఓ నమూనా యంత్రాన్ని తయారు చేశామని, ఒక టన్ను తడిచెత్తతో 30 గ్యాలన్ల బయోక్రూడ్‌ ఆయిల్‌ తయారు చేయవచ్చునని, వాహానలపై కూడా బిగించుకోగల మోడల్‌ ప్లాంట్‌ తయారీ కూడా సాధ్యమని వివరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement