క్వీన్‌ కసాండ్రా | new fashion show to regina cassandra | Sakshi
Sakshi News home page

క్వీన్‌ కసాండ్రా

Dec 21 2017 11:31 PM | Updated on Dec 21 2017 11:31 PM

new fashion show to regina cassandra - Sakshi

క్యారెక్టర్‌లో ఫిట్‌ అవ్వాలి కాబట్టి
సినిమాల్లో రెజీనా కసాండ్రా
‘రోజూ చూసే అమ్మాయి’లా ఉంటుంది. 
బయట చూడాలి.. ఫంక్షన్‌లలో, పార్టీలలో!
రాయల్‌ రెజీనాలా.. 
క్వీన్‌ కసాండ్రాలా.. అనిపిస్తుంది.

►సింపుల్‌ అండ్‌ గ్రాండ్‌ లుక్‌తో అట్రాక్ట్‌ చేస్తున్న అనార్కలీ గౌన్‌ ఇది. పై భాగం ప్లెయిన్‌ రాసిల్క్‌ మెటీరియల్‌తో డిజైన్‌ చేశారు. పార్టీలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది ఈ కాంబినేషన్‌.
ఇది సంప్రదాయ లంగా, జాకెట్టు కాంబినేషన్‌. కానీ, టాప్‌ విషయంలో ఎంచుకున్న ఫ్యాబ్రిక్, ప్రింట్, ఎంబ్రాయిడరీ ఈ స్టైల్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. సంప్రదాయ వేడుకలకే కాదు, వెస్ట్రన్‌ పార్టీలకూ ఈ స్టైల్‌ బాగా నప్పుతుంది. 

►ఈ డ్రెస్సింగ్‌ సింపుల్‌ వేడుకలకు కూడా గ్రాండ్‌ లుక్‌ తీసుకువస్తుంది. పార్టీలో తెలుపు అనగానే చాలా సింపుల్‌ అనిపిస్తుంది. కానీ, ప్లెయిన్‌ లాంగ్‌ స్కర్ట్‌ మీదకు ఇలా సంప్రదాయ తరహా ఎం్రబ్రాయిడరీ చేసిన క్రాప్‌టాప్‌ ధరిస్తే స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు. ఏ డ్రెస్‌ అయినా సరే ఆభరణాల జిలుగులు తగ్గిస్తేనే డ్రెస్‌ స్టైల్‌ మరింతగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

►ఎంబ్రాయిడరీ చేసిన గాగ్రా చోలీ సంప్రదాయ వేడుకలకు కళ తీసుకువస్తుంది. స్టైలిష్‌ లుక్‌ రావాలంటే స్లీవ్‌లెస్‌ బ్లౌజ్, నెటెడ్‌ దుపట్టా సరైన ఎంపిక.

►ఈవెనింగ్‌ పార్టీలలో ప్రత్యేకంగా నిలిచేలా స్లీవ్‌లెస్‌ వెస్ట్రన్‌ గౌన్‌కి ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన క్రాప్‌టాప్‌ అదనపు హంగులను అద్దింది. డ్రెస్‌ కలర్‌ మ్యాచ్‌ అయ్యేలా సింపుల్‌ ఆభరణాలు, హ్యాండ్‌పర్స్‌ వంటి ఇతర అలంకారాల పట్ల శ్రద్ధ తీసుకుంటే ఇలా యువరాణీ లుక్‌తో వేడుకలో హైలైట్‌ కావచ్చు.

సెలబ్రేషన్స్‌ చెన్నైలో
 ఈసారి క్రిస్మస్‌ను ఎక్కడ జరుపుకుంటున్నారు?
రెజీనా: ట్వంటీ ఫిఫ్త్‌న చెన్నైలో సినిమా షూటింగ్‌లో ఉంటాను. అక్కడే సెలబ్రేట్‌ చేసుకుంటాను. 
     
క్రిస్మస్‌కి స్పెషల్‌గా డ్రస్‌ ఏమైనా సెలక్ట్‌ చేసి పెట్టుకున్నారా?
రెజీనా: స్పెషల్‌ డ్రస్‌ అని కాదు కానీ, క్రిస్మస్‌ నాకు స్పెషల్‌ అకేషన్‌. ఆ రోజు తప్పనిసరిగా అమ్మావాళ్ల దగ్గరుంటాను. 
   
ఎలాంటి డ్రస్‌లు ఎక్కువగా ఇష్టపడతారు?
రెజీనా: ఫలానా అని ఏం లేదు.  సందర్భాన్ని బట్టి, మూడ్‌ని బట్టి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement